Begin typing your search above and press return to search.

ఇది జగన్ చేసిన రెండో తప్పేనా?

By:  Tupaki Desk   |   5 Aug 2022 11:15 AM IST
ఇది జగన్ చేసిన రెండో తప్పేనా?
X
హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఇపుడు పెద్ద దుమారం రేపుతోంది. నగ్నంగా ఎవరో మహిళతో ఎంపీ మాట్లాడుతున్నారనే వీడియో గురువారం మధ్యాహ్నం నుండి వైరల్ గా మారిపోయింది. వీడియో వెలుగుచూడగానే మాధవ్ మీడియా ముందుకొచ్చి వివరణలిచ్చారు. తాను ఎక్సర్ సైజ్ చేస్తున్నపుడు ఎవరో వీడియో తీసి దాన్ని అసభ్యంగా మార్ఫింగ్ చేశారంటు మొత్తుకున్నారు. ఆ మార్ఫుడు వీడియోను సర్క్యులేట్ చేసినందుకు చింతకాయల విజయ్ తో పాటు మరో ఇద్దరిపై ఫిర్యాదు కూడా చేసినట్లు చెప్పారు.

సరే వైరల్ అయిన వీడియో మార్పుడ్ వీడియోనా కాదా అనేది పోలీసులు తేలుస్తారు. అది నిజమైనా మార్ఫ్ డు వీడియో అయినా వ్యక్తిగతంగా ఎంపీకి పార్టీకి కూడా డ్యామేజ్ అయిపోయింది.

ఈ విషయమై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సరే చివరకు ఏమవుతుందనేది వేరే సంగతి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీలోనే మాధవ్ విషయమై నెగిటివ్ చర్చ మొదలైంది.

2019 ఎన్నికల్లో ఎంపీలుగా జగన్మోహన్ రెడ్డి ఎంపికచేసిన మాధవ్ బ్యాడ్ ఛాయిసే అని చెప్పుకుంటున్నారు. మాధవ్ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా తయారైంది. పోలీసు ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నప్పటి నుండే మాధవ్ చాలా వివాదాస్పదంగా ఉండేవారట.

అందరితోను గొడవలు, ఎవరినిపడితే వారిని నోటికొచ్చినట్లు తిట్టడం, కేసుల్లో పట్టకున్న వారిని ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో మాధవ్ బాగా వివాదాస్పదమయ్యారని సమాచారం.

చాలాసార్లు సస్పెండ్ అవ్వటం, ఛార్జి మెమోలు అందుకోవటం, వీఆర్ లోకి వెళ్ళారంటేనే ఎంతటి వివాదాస్పద వ్యక్తో అర్ధమైపోతోంది. ఏదో ఎన్నికల ముందు అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తిట్టారని ఆయనపై మీసాలు మెలేసి ఎదురు వార్నింగ్ ఇవ్వటంతో జగన్ దృష్టిలో పడ్డారు. గ్రహస్థితి బాగుండి ఎంపీగా అయిపోయారు. వెంటనే కియా యాజమాన్యంతో కూడా గొడవ పడ్డారు. మొత్తానికి మాధవ్ ది బ్యాడ్ ఛాయిసనే అంటున్నారు.