Begin typing your search above and press return to search.
రాయదుర్గంలో వైసీపీ కామెడీ ఎక్కువ అయ్యిదంట?
By: Tupaki Desk | 3 Aug 2020 5:05 PM ISTఎక్కడి విశాఖ.. ఎక్కడి రాయదుర్గం.. కర్ణాటక సరిహద్దుల్లోని రాయదుర్గంకు.. ఏపీకి కొసన ఉండే విశాఖకు చాలా దూరం.. అయితే విశాఖను పరిపాలన రాజధానిగా చేసిన వేళ రాష్ట్రమంతటా వైసీపీ శ్రేణులు సైలెంట్ గా ఉంటే.. కర్ణాటక బార్డర్ లోని రాయదుర్గంలో మాత్రం తెగ సందడి నెలకొంది. రాయదుర్గంలో ఆదివారం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆదేశాలతో వినాయక సర్కిల్ వద్ద సీఎం చిత్రపటానికి వైఎస్ఆర్ సీపీ నాయకులు పాలాభిషేకం చేశారు.
అనంతపురం జిల్లాలో ఉన్న రాయదుర్గం నియోజకవర్గం కర్ణాటకకు ఆనుకొని ఉంటుంది. అక్కడ ఎక్కువ కన్నడ-తెలుగు మాట్లాడుతారు. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలిపిన వేళ సీఎం జగన్ కృషికి అక్కడి వైసీపీ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే దగ్గరుండి ఈ పనిని చేయించారట.. విశాఖ పరిపాలన రాజధాని అయితే రాయదుర్గంలో పాలాభిషేకం చేయడంపై వైసీపీ వాళ్లే జోక్ గా మాట్లాడుకుంటున్నారట..వైజాగ్ ఎక్కడ.. మనం ఎక్కడ అని సెటైర్లు వేస్తున్నారట.. ఏంటీ కార్యక్రమం అని వైసీపీ వాళ్లే జోక్స్ వేసుకుంటున్నారట..
సంబంధం లేని.. లాభం లేని ఇలాంటి పనుల వల్ల ప్రజల్లో నవ్వుల పాలు కావడం తప్పితే మరొకటి లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. విశాఖ రాజధాని అయితే రాయదుర్గంకు ఎలాంటి లాభం లేదని.. ఎందుకని ఇలా సందడి చేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారట..