Begin typing your search above and press return to search.

పుతిన్ అనారోగ్యంపై క్లారిటీ వచ్చినట్టేనా?

By:  Tupaki Desk   |   26 Nov 2022 5:30 PM GMT
పుతిన్ అనారోగ్యంపై క్లారిటీ వచ్చినట్టేనా?
X
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలోని శక్తివంతమైన నేతల్లో ఒకరిగా కీర్తించబడున్నారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకొని ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో రష్యా అధ్యక్షుడి స్టైలే వేరు. అగ్రరాజ్యం అమెరికాకు పక్కలో బల్లెంలా మారిన పుతిన్ ఇటీవల ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించి అమెరికా.. నాటో దేశాలకు పెద్ద షాకిచ్చారు.

రష్యా-ఉక్రెయిన్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలోనే పుతిన్ అనారోగ్యం బారిన పడ్డారనే వార్తలు వినిపించాయి. ఆయన కొన్నిరోజులు అజ్ఞాతంలో వెళ్లడంతో రష్యాలో కలవరం మొదలైంది. దీనికితోడు అమెరికన్ ఇంటెలిజెన్స్ గత కొన్ని నెలలుగా పుతిన్ కాన్సర్ తో బాధ పడుతున్నాడని అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పేర్కొంది.

ఈ నేపథ్యంలో త్వరలోనే రష్యాకు కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉంటుందనే చర్చ సైతం జోరుగా నడిచింది. అయితే కొన్నిరోజుల నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వివిధ అధికారిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటుండటంతో ఆ వార్తలకు బ్రేక్ పడింది. ఈక్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ క్యూబ్ అధ్యక్షుడు మిగుయేల్ డియాజ్ కానెల్ తో ద్వైపాక్షిక చర్చలు తాజాగా జరిపారు.

పశ్చిమ దేశాలకు తమ ఉమ్మడి శత్రువు అమెరికా ఇస్తున్న అనుమతులపై నిశితంగా చర్చించారు. వీరి భేటికి అధికారిక ఫోటోలు కొన్ని బయటికి వచ్చాయి. వీటిలో క్యూబ్ అధ్యక్షుడు మిగుయేల్ డియాజ్ కానెల్ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ కరచాలనం ఇచ్చిన ఫొటోపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

పుతిన్ చేతులు పర్పుల్ రంగులోకి మారడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యంపై మరోసారి చర్చ జోరుగా సాగుతోంది. ఈ విషయంపై బ్రిటన్ ఆర్మీ మాజీ అధికారి.. హౌస్ సభ్యుడు లార్డ్స్ రిచర్డ్ దనత్ స్పందించారు. పుతిన్ చేతులపై ఉన్న మచ్చలను పరిశీలిస్తే.. ఇంజన్ సూదులు గుచ్చడం వల్ల ఏర్పడినట్లుగా ఉన్నాయని తెలిపారు.

ఈ కారణంగానే పుతిన్ చేతులు పర్పుల్ రంగంలోకి మారి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ఇటీవల పుతిన్ చేతులు నల్లగా మారడంతో ఆయనపై విష ప్రయోగం జరిగిందనే వార్తలు సైతం వినిపించాయి. అయితే అవన్నీ కూడా నరాల్లోకి ఔషధాలు ఎక్కించడం వల్లే ఏర్పడిన మచ్చలేనని పలువురు వైద్య నిపుణులు ప్రకటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.