Begin typing your search above and press return to search.

థర్డ్ వేవ్ ముప్పు తొలిగినట్టేనా?

By:  Tupaki Desk   |   9 Feb 2022 5:35 AM GMT
థర్డ్ వేవ్ ముప్పు తొలిగినట్టేనా?
X
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్నట్టే కనిపిస్తోంది. కొత్త కేసుల నమోదులో కాస్త హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మంగళవారం 15 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కేవలం 71365 మందిలో మాత్రమే వైరస్ లక్షణాలు కనిపించాయి. ముందురోజు కంటే కేసులు 5.5 శాతం అధికంగా వెలుగుచూశాయి. పాజిటివిటీ రేటు 5శాతం దిగువకు చేరి 4.5 శాతానికి తగ్గడం ఊరటనిస్తోంది.

2020 ప్రారంభం నుంచి మన దేశంలో 4.24 కోట్ల మందికి కరోనా సోకింది. వారిలో 4.10 కోట్ల (96.70 శాతం) మంది వైరస్ నుంచి బయటపడ్డారు. కోవిడ్ తో బాధపడుతున్న వారి సంఖ్య 8,92,828 (2.11 శాతం)గా ఉంది. 5,05,279 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది.

ఇక తాజా కరోనా అప్డేట్ చూస్తే.. నిన్న ఒక్కరోజే 1,72,211 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 1217 మరణాలు సంభవించాయి. అందులో 824 కేరళ లనుంచే కావడం గమనార్హం.

ఇక దేశంలో కోవిడ్ టీకా డోసులు ఇప్పటిదాకా 170.8 కోట్ల దాకా పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న 53.6 లక్షల మంది టీకా తీసుకున్నారు. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసువారిలో 5 కోట్ల మంది మొదటిడోసు వేయించుకున్నారు. యువత టీకా తీసుకునే విషయంలో ముందుకు రావడంపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ హర్షం వ్యక్తం చేశారు.

ఇక కరోనా సెకండ్ వేవ్ భారత్ ను ఊహించిన విధంగా దెబ్బతీసింది. ఈ సమయంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంతోపాటు మరణాలు సంఖ్య కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్లు అందరికీ అందుబాటులో లేకపోవడంతో మరణాలు ఎక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ సరఫరాకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీని కేంద్రం వేగవంతం చేసింది. దీంతో భారత్ లో ప్రస్తుతం కరోనా కట్టడిలో ఉంది. క్రమక్రమంగా తగ్గుతున్న కేసులు చూస్తుంటే.. దేశంలో కోవిడ్ తీవ్రత తగ్గుతోందని తెలుస్తోంది.