Begin typing your search above and press return to search.

2020లో 200 ఏళ్ల కంటే తక్కువ సూర్యరశ్మి ..ఎందుకంటే !

By:  Tupaki Desk   |   14 Feb 2020 4:00 AM IST
2020లో 200 ఏళ్ల కంటే తక్కువ సూర్యరశ్మి ..ఎందుకంటే !
X
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కలుషితం అయిపోతోంది. ఏ ఒక్కరూ కూడా పర్యావరణాన్ని రక్షించాలి అని అనుకోవడంలేదు. ఈ రోజు గడిస్తే చాలు అనుకునే వారే నూటికి తొంబై తొమ్మిదిశాతం మంది ఉన్నారు. అలాగే వాహనాలు పెరగడం కూడా కాలుష్యానికి మరో ప్రధాన కారణం. ఈ దశాబ్ద కాలంలోనే వాహనాల సంఖ్య భూ గ్రహంపై 100 రేట్లు పెరిగి పోయాయి. దీనితో ఈ వాహనాల నుండి వచ్చే వాయు కాలుష్యంతో వచ్చే కొన్ని రోజుల్లోనే భూ గ్రహం పై కీలక మార్పులు జరగబోతున్నాయి.

అలాగే , వచ్చే 30 ఏళ్లలో అతిశీతల పరిస్థితులు ఉంటాయని, మంచు తుఫాన్లు వస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఏడాది నుండి మరో 30 ఏళ్ల వరకు సూర్య రశ్మి క్రమంగా తగ్గుతూ వస్తుంది అని , ఇది మంచు యుగాన్ని తలిస్తోందని చెప్పడం భయాందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో సూర్యుడు నిద్రాణస్థితికి చేరుకుంటారని.. దీంతో ఆహార కొరత వస్తోందని , ఆహార కొరతతో భూ గ్రహంపై ఉండే సమస్త జీవులు అల్లాడిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇక సూర్యుడు సాధారణం కంటే తక్కువ వేడి ని విడుదల చేస్తారని, దానికి తగ్గట్టు ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2020లో 200 ఏళ్ల కంటే తక్కువ సూర్యరశ్మి నమోదవుతోందని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. సగటు ఉష్ణోగ్రతలు కనీసం 1 డిగ్రీ వరకు పడిపోతుందని తెలిపారు. ఇలా ఏడాది మొత్తం చల్లని వాతావరణం ఉంటుందని నార్త్ అంబ్రియా వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమితోపాటు ఇతర గ్రహాలకు కూడా తక్కువ సూర్యరశ్మి విడుదలవుతోందని తెలియజేశారు. వాస్తవానికి ప్రతీ 11 ఏళ్లకు సూర్యరశ్మి తగ్గుతున్నప్పటికీ.. ఈ ఏడాది చల్లగా ఉంటుందని.. వచ్చే 30 ఏళ్లలో పరిస్థితి తారుమారవుతోందని వెల్లడించారు.