Begin typing your search above and press return to search.

బీజేపీ మాస్టర్ ప్లాన్ లో శివసేన చిత్తు అయ్యిందా?

By:  Tupaki Desk   |   12 Nov 2019 6:59 AM GMT
బీజేపీ మాస్టర్ ప్లాన్ లో శివసేన చిత్తు అయ్యిందా?
X
మేధావి మౌనం భయం కలిగించే లా ఉంటుంది. చిరకాల మిత్రుడే అయినా.. తమను అదే పని గా చిరాకు పుట్టిస్తున్న స్నేహితుడి కి షాకిచ్చేందుకు మోడీ షాలు వేసిన మాస్టర్ ప్లాన్ లో శివసేన అడ్డం గా బుక్ అయ్యిందా? అన్నది ఇప్పుడు ప్రశ్న గా మారింది. అధికారం చేజారుతుందని భావిస్తే.. దాని కోసం దేనికైనా సిద్ధమనే తీరు ను ఇప్పటి కే బీజేపీ నేతలు ప్రదర్శించారు. ఇక.. అధికారం కోసం ఎంతకైనా సిద్ధమనే విషయాన్ని కర్ణాటక లో చేతల్లో చేసి చూపించారు.

అధికారం తమ నోటి వరకూ వచ్చి జారిపోవటాన్ని జీర్ణించుకోలేని కమలనాథులు.. నెలల తరబడి వెంటాడి వేటాడి మరీ పవర్ ను తమ సొంతం చేసుకునే వరకూ వదిలి పెట్టని కమల నాథులు.. మహారాష్ట్ర లో ఎన్నికల ఫలితం వచ్చిన నాటి నుంచి కామ్ గా ఉండిపోవటం.. శివసేన ను వీలైనంత ఎక్కువగా మాట్లాడేలా చేయటం.. చివరకు బద్దశత్రువు కాంగ్రెస్.. ఎన్సీపీ లతో చేతులు కలిపే వరకూ వెళ్లేలా చేయటం లాంటివన్నీ మోడీ షాలు వేసిన మాస్టర్ ప్లానా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

మహారాష్ట్రం లో తమ బలాన్ని పెంచుకోవటం తో పాటు.. హిందుత్వ ఓటు బ్యాంకు నమ్మకమైన పార్టీగా అవతరించటానికి వీలుగా బీజేపీ ప్లాన్ చేసిందా? అంటే అవునన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలించినప్పుడు శివసేనకు తమకు మించిన అప్షన్ లేకపోవటం.. ఒకవేళ సేన తన కు తాను గా ఎన్సీపీ.. కాంగ్రెస్ వద్ద కు వెళ్లినా.. వారు ఎట్టి పరిస్థితుల్లో నూ ఓకే చెప్పరన్న ఆత్మ విశ్వాసం తో పాటు.. తమకున్న లో గుట్టు సమాచారం తో ఏదైతే అది అవుతుందన్న దీమా ను ప్రదర్శించారని చెబుతున్నారు.

సేన ముకుం పట్టు కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ లేకపోయిన వైనాన్ని మరాఠా ప్రజలకు అర్థమయ్యేలా చేసిన బీజేపీ.. శివసేన మీద ప్రజల్లో వ్యతిరేకత పెంచేలా పావులు
కదపటమే కాదు.. మరోసారి ఎన్నికలు వచ్చిన పక్షం లో శివసేనకు షాకిచ్చే లా సిద్దం చేసిన వ్యూహాన్ని కమల నాథులు పక్కా గా అమలు చేశారంటున్నారు. దీనికి తగ్గట్లే.. శివసేన కోరిక ను అత్యాశ గా చిత్రీకరించటం లో సక్సెస్ అయిన బీజేపీ.. తమకేమాత్రం భావ సారూప్యత లేని ఎన్సీపీ.. కాంగ్రెస్ లతో కలిసి పోవటానికి చేసిన ప్రయత్నాన్ని బరి తెగింపు చర్య గా చూపించే విషయం లో కమలనాథులు సక్సెస్ అయ్యారంటున్నారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ లో శివసేన పులుసు లో ములక్కాయలా మారటమే కాదు.. రెంటికి చెడ్డ రేవడి లా మారిందనటం లో మరెలాంటి సందేహం లేదంటున్నారు. బీజేపీ వ్యూహ చతురత ను సేన క్యాంప్ తక్కువగా అంచనా వేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.