Begin typing your search above and press return to search.
ఢిల్లీకి వెళ్లే ప్లాన్ ఉందా? వాయిదా వేసుకోవటమే మంచిది
By: Tupaki Desk | 13 Nov 2020 12:20 PM ISTఅమెరికాతో పాటు యూరప్ దేశాల్లో కరోనా మళ్లీ చెలరేగిపోవటం తెలిసిందే. సెకండ్ వేవ్ తీవ్రతతో ఆ దేశాల్లో నమోదవుతున్న కేసుల తీవ్రతతో కొన్నిచోట్ల లాక్ డౌన్ విధిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సెకండ్ వేవ్ ముప్పు మనకూ ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. కొందరు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. మరికొందరు మాత్రం.. నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఇలా సెకండ్ వేవ్ గురించి మాట్లాడుతున్న వేళలోనే దేశ రాజధానిలో నమోదవుతున్న కేసులు డేంజర్ బెల్స్ మోగుతున్నట్లుగా చెప్పక తప్పదు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో అత్యధికంగా 8593 కేసులు నమోదు కావటం గమనార్హం. మొదటిదశలోనూ ఢిల్లీలోనే అత్యధిక కేసులు నమోదు కావటం.. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే.. తొందరగా కేసులు నమోదు తగ్గటం తెలిసిందే. తాజాగా సెకండ్ వేవ్ అన్న సందేహాలకు తగ్గట్లే.. అక్కడ కేసులు నమోదవుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లే ప్లాన్ ఉంటే కాస్త వాయిదా వేసుకోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేసుల నమోదు మాత్రమే కాదు.. పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 85 మంది కరోనా కారణంగా మరణించినట్లుగా చెబుతున్నారు. ఇదంతా చూసినప్పుడు ఢిల్లీలో నమోదవుతున్న కేసుల సంఖ్య.. దేశంలోకి సెకండ్ వేవ్ వచ్చేసినట్లేనన్న మాట వినిపిస్తోంది. ఇందులో వాస్తవం ఉందా? లేదా? అన్న సందేహాల కంటే.. ఎవరికి వారు జాగ్రత్తలతో ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది.
ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా పరిస్తితి చూస్తే.. అమెరికాలో సెకండ్ వేవ్ అగ్రరాజ్యానికి చుక్కలు చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1.41లక్షల కేసులు నమోదు కాగా.. ఇటలీలో 37వేలు.. ఫ్రాన్స్ లో 35 వేలు.. పోలండ్ లో 22వేలు.. జర్మనీలో 23 వేలు.. బ్రెజిల్.. రష్యాలలో 21వేల చొప్పున కేసులు నమోదయ్యాయి. మనదేశంలో 47వేల కేసులునమోదు కాగా.. అందులో 8వేలకు పైనే కేసులు ఒక్క ఢిల్లీలోనే నమోదు కావటం గమనార్హం. ఢిల్లీ తర్వాత అత్యధిక కేసుల నమోదులో కేరళ (7వేలు).. మహారాష్ట్ర (4907).. తమిళనాడు (2112).. కర్ణాటక (2116)లో నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో 1728కేసులు నమోదు కాగా.. తెలంగాణలో 1015 కేసులు నమోదయ్యాయి.