Begin typing your search above and press return to search.

తిరుగుబాటు ఎంపీది గుడ్డి వ్యతిరేకతేనా ?

By:  Tupaki Desk   |   20 Aug 2022 9:30 AM GMT
తిరుగుబాటు ఎంపీది గుడ్డి వ్యతిరేకతేనా ?
X
నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు. అదేమిటంటే విషయం ఏమిటైనా సరే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగాను, ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని. ఇలాంటి గుడ్డివ్యతిరేకత వల్లే చాలాసార్లు అనవసరమైన విషయాల్లో కెలుక్కుని రోడ్డుపైన ఉన్న చెత్తను నెత్తినేసుకుంటున్నారు. ఇపుడిదంతా ఎందుకంటే హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో విషయంలో అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ నిపుణుడు జిమ్ స్టఫోర్డ్ సీఐడీకి ఇచ్చిన రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఇక్కడ ఎంపీ గమనించాల్సిన విషయం ఏమిటంటే జిమ్ స్టాఫోర్టు నుండి సీఐడీకి వచ్చిన రిప్లైని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీడియాకు రిలీజ్ చేశారు. స్టఫోర్డు ఇచ్చిన నివేదిక పేరుతో టీడీపీ రిలీజ్ చేసిన సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ తప్పని సీఐడీకి స్టఫోర్డు ఇచ్చిన సమాచారం రెండుకూడా మీడియాలో సర్క్యులేషన్లో ఉన్నాయి.

బహుశా ఈ విషయంలో ఎంపీ అప్ డేట్ అవ్వలేదేమో. ఇదే సమయంలో స్టఫోర్డ్ టీడీపీకి ఇచ్చిన నివేదిక కరెక్టేనా కాదా అని తెలుసుకోవాల్సిన అవసరం సీఐడీకి ఏమొచ్చింది ? అని అడగటంలోనే ఎంపీ అజ్ఞానం కనబడుతోంది.

అంటే అధికారపార్టీ ఎంపీకి వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రభుత్వం భరించాల్సిందే అన్నట్లుగా ఎంపీ మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ సర్క్యులేషన్లో పెట్టిన ఒక సర్టిఫికేట్ నిజమా కాదా తెలుసుకోవటంలో ప్రభుత్వం తప్పుచేసిందని ఎంపీ ఎందుకు అనుకుంటున్నారో అర్ధం కావటంలేదు. అలా తెలుసుకోవటం వల్లేకదా టీడీపీ చూపించిన సర్టిఫికేట్ ట్యాంపర్డ్ సర్టిఫికేట్ అని తేలింది ?

హోలుమొత్తం మీద చూస్తే నిజానికి ఈ విషయానికి ఎంపీకి ఎలాంటి సంబంధంలేదు. అయినా రఘురాజుకు కూడా ప్రతిపక్ష ఎంపీగానే వ్యవహరిస్తున్న కారణంగా ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటున్నారు. ఇక కేంద్రంలోని ఇంధనసంస్ధకు బకాయిలు చెల్లించని కారణంగానే ఏపీ విద్యుత్ కొనుగోలు, అమ్మకాన్ని కేంద్రం ఆపేసిందన్నారు.

వాస్తవానికి ఏపీ విషయంలో కేంద్ర ఇంధనసంస్ధ తప్పుచేసిందని బయటపడింది. బకాయిలు చెల్లించినా ఆ విషయం అప్ డేట్ కాని కారణంగానే బ్యాన్ చేసిన 13 రాష్ట్రాల్లో ఏపీని కూడా చేర్చినట్లు స్వయంగా కేంద్రమే చెప్పిన విషయాన్ని తిరుగుబాటు ఎంపీ గమనించినట్లులేదు.