Begin typing your search above and press return to search.

మంత్రుల పోటీ యాత్ర రెడీ అవుతోందా ?

By:  Tupaki Desk   |   22 Oct 2022 5:30 AM GMT
మంత్రుల పోటీ యాత్ర రెడీ అవుతోందా ?
X
అమరావతి జేఏసీ పాదయాత్రను ఎదుర్కునేందుకు మంత్రులు పోటీ యాత్ర చేయటానికి రెడీ అవుతున్నారా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. కొద్దిరోజుల్లో అమరావతి టు అరసవల్లి పాదయాత్ర విశాఖపట్నం నగరంలోకి ప్రవేశించబోతోంది.

అప్పటికి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ డిమాండుకు మంచి ఊపు తీసుకురావాలని మంత్రులు ఆలోచిస్తున్నారు. ఇదే విషయమై సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు నాయకత్వంలో బొత్సా సత్యనారాయణ, గుడివాడ అమర్ నాధ్, కారుమూరి నాగేశ్వరరావుతో పాటు మరికొందరు ఎంఎల్ఏలు కూడా భేటీ అయ్యారు.

అమరావతి డిమాండుతో జరుగుతున్న పాదయాత్ర కు పోటీగా మూడు రాజధానులకు మద్దతుగా మరో పాదయాత్ర చేయటం చాలా అవసరమని దర్మాన అభిప్రాయపడ్డారు. మూడురాజధానుల అవసరాన్ని రాష్ట్రంలో అందరు జనాలకు వివరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ధర్మాన చేసిన సూచనకు మిగిలిన అందరు సానుకూలంగా స్పందించారు. మంత్రుల ఆధ్వర్యంలో చేయాలని అనుకుంటున్న యాత్రను ఉత్తరాంధ్రకు మాత్రమే పరిమితం చేయాలా లేకపోతే మూడు ప్రాంతాల్లోను చేయాలా అనే విషయమే తేలలేదు.

పోటీ యాత్ర మూడు ప్రాంతాల్లోను చేయాలంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రలోని మంత్రులు, ఎంఎల్ఏలందరినీ ఇన్వాల్స్ చేయాలనే ఆలోచనను అందరూ సమర్ధించారు. అయితే పోటీయాత్రలు ఎప్పటినుండి చేయాలి ? అన్నదే పెద్ద సమస్య అయిపోయింది. ఇదే సమయంలో మంత్రులందరు పోటీయాత్రల్లో పాల్గొంటే అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందుల్లో పడుతుందనే చర్చకూడా జరిగింది.అందుకనే పాదయాత్రలో మంత్రులు పాల్గొనాల్సిన అవసరం వస్తే మూడు ప్రాంతాల్లో ఒకేసారి కాకుండా ప్రాంతాలవారీగా మొదలుపెడితే ఎలాగుంటుందన్న విషయంపైన కూడా చర్చ జరిగింది.

అంటే ఉత్తరాంధ్రలో మంత్రులు పాదయాత్రలో పాల్గొంటే మిగిలిన ప్రాంతాల్లోని మంత్రులు కాకుండా ఎంఎల్ఏలు మాత్రమే పాల్గొంటే ఎలాగుంటుందనే చర్చ జరిగింది. అలాగే రాయలసీమలో యాత్ర మొదలైతే మిగిలిన ప్రాంతాల్లోని మంత్రులు కాకుండా ఎంఎల్ఏలు పాల్గొనేట్లుగా ఆలోచిస్తున్నారు.

అవసరమైనపుడు మంత్రులు హాజరైతే సరిపోతుందనే ఆలోచన కూడా జరిగింది. ఈ పద్దతిలో మూడు ప్రాంతాల్లోని మంత్రులు, ఎంఎల్ఏలందరినీ పాదయాత్రల్లో భాగస్వాములను చేస్తే జనాల్లో ఎఫెక్టు బాగుంటుందని అధికారపార్టీ ఆలోచిస్తోంది. తొందరలోనే ఈ విషయమై అందరు సమావేశమై నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.