Begin typing your search above and press return to search.
కేటీఆర్ సీఎం పట్టాభిషేకం ఖాయమే?
By: Tupaki Desk | 26 Jan 2021 7:00 PM ISTతెలంగాణలో సీఎం కుర్చీ మార్పుపై వస్తున్న ఊహాగానాలు అన్నీ ఇన్నీ కావు.. తనయుడు కేటీఆర్ కు పగ్గాలు అప్పగించేందుకు కేసీఆర్ రెడీ అయ్యారన్న వార్త తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇటీవల కేటీఆర్ ముందే డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఈ మాట అన్నా కూడా కేటీఆర్ నోరు మెదపలేదు. ఇటు కేసీఆర్ సైతం గుంభనంగానే ఉంటున్నారు.
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సీఎం కేసీఆర్ తన తనయుడు , వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సీఎంగా చేసేందుకు దాదాపు డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోందంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవి లేదా మే మాసంలో సీఎంగా కేటీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరిలో కూడా అది జరగొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట.. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలే కేటీఆర్ కు సీఎం పదవి అప్పగించడం దిశగా సాగుతున్నాయని తెలుస్తోంది.
కేసీఆర్ సీఎంగా ఉన్న క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నారన్న విమర్శ ఉంది. వయోభారం, అనారోగ్యం ఆయనను వెంటాడుతున్నట్టు సమాచారం. అందుకే యువకుడైన కేటీఆర్ ను సీఎం చేస్తే ఆ లోటు తీరుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట.. ఫిబ్రవరి 17న కేసీఆర్ బర్త్ డే అని.. మరుసటి రోజు ఫిబ్రవరి 18న కేటీఆర్ సీఎంగా బాధ్యతలు చేపడుతారని అంటున్నారు. పార్టీ పరంగా.. ప్రభుత్వ పరంగా బడ్జెట్ సమావేశాల తర్వాత కొన్ని కీలక నిర్ణయాల దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
కేటీఆర్ ను సీెం చేసిన తర్వాత కేసీఆర్ కొన్ని పాలన సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య టీఆర్ఎస్ పై వ్యతిరేకత.. దుబ్బాకలో ఓటమి నేపథ్యంలోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది..