Begin typing your search above and press return to search.

బెంగాల్ పీఠం మళ్ళీ మమతదేనా ?

By:  Tupaki Desk   |   28 Feb 2021 3:05 PM IST
బెంగాల్ పీఠం మళ్ళీ మమతదేనా ?
X
హోరా హోరీగా సాగుతున్న బెంగాల్ రాజకీయంలో మమతా బెనర్జీదే పై చేయా ? అలాగే ఉంది తాజాగా వెల్లడైన ఎన్నికల ప్రెడిక్షన్ చూస్తుంటే. ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఏబీపీ-సీ వోటర్ ఒపినీయిన్ పోల్ నిర్వహించింది. దీని ప్రకారం బెంగాల్లోని మొత్తం 294 సీట్లలో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 148-164 సీట్లు సాధిస్తుందని తేలింది. ఇక బీజేపీ 92-108 సీట్ల మధ్య గెలుచుకుంటుందని వెల్లడైంది.

బెంగాల్లో బీజేపీ జెండాను ఎగరేయాలనే ఉద్దేశ్యంతో నరేంద్రమోడి, అమిత్ షా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అందరీకి తెలిసిందే. అధికారపార్టీకి చెందిన ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు సీనియర్ నేతలను బీజేపీలొకి చేర్చేసుకుంటున్నారు. రాష్ట్రంలో గవర్నర్ ను అడ్డం పెట్టుకుని నానా రబస సృష్టిస్తున్నారు. సరే మమత కూడా వీళ్ళని అంతే ధీటుగా ఎదుర్కొంటోంది లేంది. మొత్తానికి ఒపినీయన్ పోల్ మమతకు అనుకూలంగా ఉందని వచ్చింది. లెఫ్ట్ కూటమికి 39 సీట్లు సాధిస్తుందట.

ఇక తమిళనాడు విషయం చూస్తే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కూటమి 154-162 సీట్లతో అధికారంలోకి రావటం ఖాయమని తేల్చేసింది. ఇక్కడ 234 సీట్లున్నాయి. ఏఐఏడీఎంకే కూటమి 58-66 సీట్ల మధ్యలో గెలుచుకుని ప్రతిపక్షంలో కూర్చుంటుందట. ఇతరులు 20 సీట్లు సాధించవచ్చని తేలింది. మరి ఈ ఇతరుల్లో బీజేపీ ఉందో లేదో తెలీదు. కేరళలోని 140 సీట్లలో పాలక ఎల్డీఫ్ 83-91 స్ధానాల్లో విజయం సాధిస్తుందని తేల్చింది. అంటే పినరయి విజయన్ నేతృత్వంలోని కూటమిదే మళ్ళీ అధికారం అని అర్ధమవుతోంది. యూడీఎఫ్ కూటమి 47-55 సీట్లు సాధిస్తుందట.

అలాగే 126 అస్సాంలో బీజేపీ కూటమి 68-76 సీట్లు సాధిస్తుందని తేలింది. కాంగ్రెస్ కూటమికి 43-51 మధ్యలో సీట్లు తెచ్చుకుంటుందట. ఇతరులు 5-10 సీట్లలో గెలుస్తారని అంచనా. చివరకు పాండిచ్చేరిలో బీజేపీ కూటమి 17-21, కాంగ్రెస్ కూటమి 8-12 సీట్లలో విజయం సాధిస్తుందని తేలింది. ఇతరలకు ఒక సీటొస్తుందట. మొత్తం మీద బెంగాల్లో బీజేపీ జెండా ఎగరాలంటే మరో ఐదేళ్ళు నిరీక్షణ తప్పదేమో.