Begin typing your search above and press return to search.
తిరుపతికి జేసీ బ్రదర్స్ రానిది అందుకేనా?
By: Tupaki Desk | 12 April 2021 10:00 PM ISTఅధికార ప్రతిపక్షాలన్నీ మోహరించాయి. తిరుపతిలో ఇప్పుడు హోరాహోరీ తలపడుతున్నాయి. సీఎం జగన్ రాకున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను మోహరించారు. ఇక చంద్రబాబు, లోకేష్ హోరెత్తిస్తున్నారు. అటు బీజేపీ-జనసేన దంచి కొడుతున్నాయి.
ఇంత వేడిలో ఏ అవకాశాన్ని కూడా పార్టీలు వదలుకోవడం లేదు. అందుకే తిరుపతి పరిధిలో అత్యధికంగా ఉన్న బలిజలు, రెడ్లు, దళితుల ఓట్లను క్యాష్ చేసుకునేందుకు ఆ సామాజికవర్గంలోని పెద్ద నేతలను బరిలోకి దింపుతున్నారు.
వైసీపీ ముఖ్యంగా పార్టీలోని బలమైన రెడ్డి , దళిత ముఖ్య నేతలు అందరినీ మోహరించింది. ఇక బలిజల కోసం టీడీపీ, బీజేపీ ఫైట్ చేస్తున్నాయి. జనసేన సపోర్టుతో బలిజలు బీజేపీ వైపు ఉంటున్నారు.
అయితే రెడ్డిలు అధికంగా ఉన్న తిరుపతికి పక్క జిల్లా అనంతపురంలో ఉండే బలమైన రెడ్డి నేతలు జేసీ బ్రదర్స్ తిరుపతి ప్రచారానికి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది... ఇటీవలే మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటి వైసీపీకి షాకిచ్చిన జేసీ బ్రదర్స్ వస్తే ఊపు వస్తుందని అనుకున్నారట.. రెడ్డిలలో బలమైన ఈ బ్రదర్స్ వస్తే టీడీపీకి కొంత ఎడ్జ్ ఉండేది అంటున్నారు.
జేసీ బ్రదర్స్ రాకపోవడానికి కారణం ఏమై ఉంటుందని ఇప్పుడు ఆరా తీస్తున్నారు. బాబు పిలవలేదా? లేక ఓడిపోయే సీటులో ప్రచారం చేసి పరువు పోగొట్టుకోకూడదని రాలేదా? అని చర్చించుకుంటున్నారట..