Begin typing your search above and press return to search.
కవితకు ఆ పోర్ట్ ఫోలియో కన్ఫం అయినట్టేనా?
By: Tupaki Desk | 2 Nov 2020 6:00 PM ISTకూతురును ఎలాగైనా హోంమినిస్టర్ ను చేయాలని కేసీఆర్ తలపోస్తున్నారా? పీఎం నరేంద్ర మోడీ తన నమ్మినబంటు అయిన అమిత్ షాను కేంద్ర హోంమంత్రిగా పెట్టి దేశంలో చక్రం తిప్పుతున్నట్టే కేసీఆర్ కూడా తిప్పాలని యోచిస్తున్నారా? ఆ క్రమంలోనే కూతురు కవితను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారా? ఇటీవల ఓ బీసీ మంత్రిపై వచ్చిన ఆరోపణలు దేనికి సంకేతం.. ఇలా టీఆర్ఎస్ పార్టీలో అనేక ప్రశ్నలు.. కల్వకుంట్ల కవితను మళ్లీ యాక్టివ్ చేయడానికే ఇదంతా జరుగుతున్నాయనే దానికి బలాన్ని ఇస్తున్నాయనే చర్చ సాగుతోంది.
కేసీఆర్ కుమార్తె అయిన మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంత్రి పదవి ఖాయమైందని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కవితకు కేవలం ఎమ్మెల్సీ ఇస్తే సరిపోదని.. మంత్రిపదవి ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని.. అందుకే రాజ్యసభ సీటును కాదని ముందుగా ఎమ్మెల్సీ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. కవితకు పార్టీ గ్రిప్ లో ఉండే పోర్ట్ ఫోలియో ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం సాగుతోంది.
కవితకు హోంమంత్రి పదవి ఇవ్వాలని.. అప్పుడైతేనే అన్ని పోర్ట్ ఫోలియోలు వాళ్ల చేతిలో ఉంటాయని.. రాబోయే ఎన్నికల్లో పోలీస్ డిపార్ట్ మెంట్ ని వాళ్ల గ్రిప్ లో పెట్టుకోవాలని చూస్తున్నారని తెలంగాణలో జోరుగా ప్రచారం సాగుతోంది.
హరీష్ రావుకు ఆర్థికశాఖ, కేటీఆర్ కు ఐటీ, పరిశ్రమలు, కవితకు హోంమంత్రిత్వశాఖ కట్టబెడితే కీలక శాఖలన్నీ వాళ్ల చేతిల్లోనే ఉండి రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాల వస్తాయని కేసీఆర్ ఆలోచిస్తున్నారని టాక్ నడుస్తోంది. అందుకే కవితకు హోంశాఖ ఇవ్వాలనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోందట.
అయితే ఇటీవల టీఆర్ఎస్ కు కొంచెం ఫేవర్ గా ఉన్న వాళ్ల చానెల్ లో ఒక తెలంగాణ మంత్రి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని.. కాబట్టి అతడి పోస్ట్ ఊడిపోతుందని.. అతడి స్తానంలో కవితను భర్తీ చేస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
కవిత ఎంట్రీ చేసి.. కేబినెట్ ను కేసీఆర్ పునర్వ్యస్థీకరిస్తారని.. ఇప్పుడు ఉన్న హోంమంత్రి మహమూద్ అలీని వేరే శాఖకు మార్చి కవితకు హోంమంత్రి పదవి కట్టబెడుతారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాతనే మంత్రి వర్గ విస్తరణ ఉండబోతోందని కూడా అంటున్నారు. చూద్దాం.. కవితకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది.