Begin typing your search above and press return to search.
చీరాలలో పడిన చేప రూ.1.70లక్షల పలికింది
By: Tupaki Desk | 23 Sept 2020 12:00 PM ISTఅవును.. ఆ చేప ధర రూ.1.70లక్షల ధర పలికింది. రికార్డు స్థాయిలో పలికిన ఆ ధరకు ఆ చేపను పట్టిన మత్య్సకారుడు మురిసిపోయాడు. ఇంతకూ ఒక చేపకు అంత ధర ఎందుకు పలికింది? అన్నది ఒక ప్రశ్న. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల వాడరేవులో లభించిన ఈ చేప ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
చీరాలకు చెందిన దోని దేవుడు అనే మత్స్యకారుడు ఉన్నాడు. రోజు మాదిరే మంగళవారం కూడా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లాడు. అతనేమాత్రం ఊహించని రీతిలో అతడి సుడి తిరిగిపోయింది. వల విసిరినప్పుడు భారీ బరువు పడటంతో ఒక్కసారిగా అలెర్టు అయ్యాడు. వల పైకి లాగగా ఒక భారీ చేప పడినట్లుగా గుర్తించాడు.
వెంటనే దాన్ని తీసుకొని ఒడ్డుకు చేరుకున్నాడు. తీరా చూస్తే..ఆ చేప కాస్త అరుదైనదిగా తేలింది. 28 కేజీల బరువు ఉన్న ఆ చేపను కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడ్డారు. చూస్తుండగానే వేలు దాటేసి ఏకంగా రూ.1.70లక్షల భారీ మొత్తానికి బేరం వెళ్లింది. చివరకు అక్కడి స్థానిక వ్యాపారి దారకొండ అనే వ్యక్తి ఆ చేపను రూ.1.70లక్షలు ఇచ్చి దోనిదేవుడి నుంచి సొంతం చేసుకున్నాడు.
అంత భారీగా ఖర్చు చేసి కొన్న ఆ చేప కచ్చిలిగా చెబుతున్నారు. ఈ చేప ప్రత్యేకత ఏమంటే.. దాని పొట్ట భాగాన్ని మందుల్లో వినియోగిస్తారని చెబుతున్నారు. ఈ కారణంతోనే దీనికి భారీగా ధర పలికినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. ఒకే చేపకు రూ.1.70లక్షల మొత్తం రావటం చాలా అరుదుగా జరుగుతుందన్న మాట మత్స్యకారుల నోటి నుంచి వినిపిస్తోంది. ఏమైనా దోనిదేవుడి సుడి తిరిగిందని.. దాన్ని సొంతం చేసుకున్న వ్యాపారికి కూడా భారీ లాభమే ఉంటుందని చెబుతున్నారు.