Begin typing your search above and press return to search.

భూమా కుటుంబానికి మరో షాక్ తప్పదా ?

By:  Tupaki Desk   |   20 Jan 2021 5:00 AM IST
భూమా కుటుంబానికి మరో షాక్ తప్పదా ?
X
తొందరలోనే భూమా కుటుంబానికి కర్నూలు జిల్లాలో పెద్ద షాక్ తప్పేట్లు లేదు. రెండున్నర దశాబ్దాలుగా భూమా నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఉన్న విజయడైరీ ఛైర్మన్ చేజారిపోయే పరిస్ధితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఛైర్మన్ గా ఉన్న భూమా నారాయణరెడ్డి దివంగత ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డికి చిన్నాన్నవుతారు. గడచిన 28 ఏళ్ళుగా ఈయనే ఛైర్మన్ గా ఉంటున్నారు. ఏడాదికి రూ. 140 కోట్ల టర్నోవర్ ఉన్న ఆ డైరీపై భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి కన్నుపడింది. ఎలాగైనా ఈయన్ను పదవిలో నుండి దింపేయాలని ప్లాన్ వేశారు.

వీళ్ళ ప్లాన్ ఇలాగుండగానే డైరీ ఛైర్మన్ పదవిపై వైసీపీ నేతల కన్నుకూడా పడింది. వెంటనే నేతలంతా కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి పరిస్ధితిని వివరించారు. దాంతో ఛైర్మన్ పదవికి ఎస్వీ జగన్మోహన్ రెడ్డిని సీఎం ఛైర్మన్ అభ్యర్ధిగా ఎంపికచేశారు. ఈ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఎవరయ్యా అంటే మాజీ ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డి సోదరుడు. అంటే భూమా శొభానాగిరెడ్డికి స్వయాన సోదరుడు. అఖిల అండ్ కో కు మేనమామ అవుతారన్నమాట.

అయితే రాజకీయంగా దారులు వేరయ్యాయి కాబట్టి రెండు కుటుంబాలు ప్రత్యర్ధులన్నట్లే. అందుకనే రెండు కుటుంబాలు కూడా ఎవరికి వాళ్ళుగా ఛైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే ఊహించని విధంగా బోయినపల్లి కిడ్నాప్ కేసులో మొత్తం భూమా కుటుంబం అంతా తగులుకున్నది. కిడ్నాప్ కేసులో నుండి ఎలా బయటపడాలో అర్ధంకాక వాళ్ళు తన్నుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే డైరీ పాలకవర్గంలో మూడు డైరెక్టర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. వాటిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలా ? లేక ఎన్నిక జరపాలా అన్నది సస్పెన్సుగా మారింది.

అయితే మూడు డైరెక్టర్ పోస్టులకు ఎనిమిదిమంది పోటి పడటంతో ఎన్నిక అనివార్యమైంది. దాంతో ఎస్వీ జగన్మోహన్ రెడ్డి తో పాటు మరో ఆరుగురు నామినేషన్లు వేసేశారు. అంటే మంగళవారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. సరే ఎలాగూ స్వయంగా సీఎమ్మే చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మిగిలిన వాళ్ళు పోటీ చేసేంత ధైర్యం చేస్తారని అనుకోవటం లేదు. ఎందుకంటే సీఎం క్యాండిడేటుకు మద్దతుగా జిల్లాలోని ఎంఎల్ఏలు, ఎంపిలు రంగంలోకి దిగారు. కాబట్టి ఇపుడు ఎన్నికవ్వబోయే ముగ్గురు డైరెక్టర్లు కూడా అధికారపార్టీ వాళ్ళే అవుతారు. అలాగే తొందరలోనే ఛైర్మన్ ఎన్నిక కూడా జరగబోతోంది. అంటే అధికారపార్టీ వాళ్ళే ఎక్కువమంది ఉన్న తర్వాత ఛైర్మన్ పదవి కూడా వైసీపీ నేతకే దక్కుతుందనటంలో సందేహం లేదు.

మరి ఇంతకాలం డైరీ ఛైర్మన్ పదవి కోసం పడరాని పాట్లు పడిన భూమా కుటుంబం పరిస్దితేమిటి ? ఏమిటంటే చూస్తు ఊరుకోవటం తప్ప చేయగలిగేదేమీ లేదు. ఎందుకంటే ముందు కిడ్నాప్ కేసులో నుండి అక్కా, బావ, బావమరిది బయటపడాలి కదా. ఒకవైపు ఎంఎల్ఏలుగా ఓడిపోయి, మరోవైప కిడ్నాప్ కేసులో తగులుకుని, చివరగా ఇంతకాలం కలలుకంటున్న ఛైర్మన్ పదవి కూడా పోతే ఇక భూమా కుటుంబానికి మిగిలేదేమిటి ? మరి ఇంతపెద్ద షాక్ నుండి ఎలా తట్టుకుంటారో ఏమో.