Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర సీఎం శివసేన ఆదిత్య థాకారేనా?

By:  Tupaki Desk   |   24 Oct 2019 5:58 AM GMT
మహారాష్ట్ర సీఎం శివసేన ఆదిత్య థాకారేనా?
X
మహారాష్ట్రలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. బీజేపీ కేవలం రెండంకెల స్కోరుకే పరిమితం అవుతోంది. కేవలం 99 స్థానాల్లోనే బీజేపీ పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. దీంతో శివసేన కొత్త డిమాండ్లు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ మార్క్ 145. అయితే బీజేపీ కేవలం 99 సీట్లలో ఆధిక్యంలో ఉండడం శివసేనకు అందివచ్చిన అవకాశంగా మారింది. గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 23 సీట్లలో బీజేపీ వెనుకబడడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. శివసేన సొంతంగానే 55కు పైగానే సీట్లను సాధించి కింగ్ మేకర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి..

మహారాష్ట్రలో బీజేపీకి షాక్ తగలడం.. కేవలం 99 సీట్లకే పరిమితమవ్వడం చూశాక ఇప్పుడు సీఎం పీఠంపై శివసేన కన్నేసినట్టు కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు శివసేన మద్దతు బీజేపీకి తప్పనిసరి. ఈ డిమాండ్ నేపథ్యంలో శివసేన తమకే సీఎం అభ్యర్థి కావాలని ఒత్తిడి తేవడానికి రెడీ అయినట్లు తెలిసింది.

శివసేన అధినేత థాకేరా కుమారుడు ఆదిత్య థాకరే ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీచేశారు. వర్లి నుంచి గెలుపు దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో సీఎం పీఠం తమకు ఇస్తేనే బీజేపీకి మద్దతిస్తామని శివసేన కండీషన్లు పెట్టేందుకు రెడీ అయినట్లు తెలిసింది.. లేదంటే కనీసం రెండున్నరేళ్ల చొప్పున అయినా అధికారం పంచుకోవడానికి ప్రతిపాదనలు పెట్టడానికి రెడీ అయ్యింది.

ఇక బీజేపీ కనుక ఈ ప్రతిపాదనకు నో అంటే 55 సీట్లకు పైగా ఉన్న శివసేన, ఎన్సీపీ 51 సీట్లు, కాంగ్రెస్ 45 సీట్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుందనే ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి పీఠం ఇస్తే ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలవడానికి అభ్యంతరం లేదని శివసేన ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఇదే జరిగితే బీజేపీకి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. సీట్లు తగ్గిపోవడంతో ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన ఆడించినట్టు బీజేపీ ఆడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.