Begin typing your search above and press return to search.

ఉత్తర కొరియాకు ఆమెనే భవిష్యత్తా?

By:  Tupaki Desk   |   28 Nov 2022 7:57 AM GMT
ఉత్తర కొరియాకు ఆమెనే భవిష్యత్తా?
X
ఉత్తరకొరియా అన్నంతనే గుర్తుకు వస్తారు ఆ దేశ అధినేత కమ్ నియంత కిమ్ జాంగ్ ఉన్. కఠినమైన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు. ఆయన ఆరోగ్యంపై తరచూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే..

ఆయన రాజకీయ వారసులు ఎవరు? అన్నది తరచూ చర్చగా మారుతుంటుంది. ఇప్పటివరకు వినిపిస్తున్న దానికి భిన్నంగా తాజాగా కిమ్ వారసురాలిగా.. భవిష్యత్తు ఉత్తర కొరియా అధికార పీఠం ఎవరికి దక్కుతుందన్న దాని మీద కొత్త వాదన తెర పైకి వచ్చింది.

దీనికి కారణం కిమ్ రెండో కుమార్తె జుయే తరచూ బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉండటమే. కేవలం పదేళ్లు మాత్రమే వయసున్న ఈ చిన్నారి రాబోయే రోజుల్లో అత్యంత శక్తివంతురాలుగా మారుతుందని చెబుతున్నారు. ఆమె పేరు జుయే. ఆమె ప్రత్యేకత ఏమంటే.. తన వయసున్న వారితో పోలిస్తే.. పొడుగ్గా కనిపించే జోయే.. ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాల్లో హాజరు కావటం.. ఆమెకు కిమ్ ఇస్తున్న ప్రాధాన్యత కొత్త చర్చగా మారింది.

పదేళ్ల చిన్న వయసులో తండ్రితో పాటు.. ఖండాంతర క్షిపణి పరీక్షల ప్రయోగానికి హాజరు కావటం.. ఆమెను వెంట పెట్టుకొచ్చిన తీరు ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. నిజానికి ఆమె మీడియా కంట పడింది.. కెమేరాల్లోకి చిక్కింది ఆ సందర్భంలోనే.

కిమ్.. తన కుమార్తె జుయేతో కలిసి ఉన్న ఫోటోలో.. శాస్త్రవేత్తలు.. ఇతర అధికారులతో చర్చిస్తున్న వైనం కనిపిస్తోంది. అధికార మీడియాలోనూ వచ్చిన ఈ ఫోటోతో కొత్త చర్చకు తెర తీసినట్లైంది. మరి.. రానున్న రోజుల్లో జుయే ఏమేం చేయనుందన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.