లిప్ కిస్ తో ఇంత ప్రమాదమా?

Sun May 09 2021 18:00:02 GMT+0530 (IST)

is serious with Lip Kiss?

ముద్దంటే ఇష్టం లేనివారు ఎవరైనా ఉంటారా? ఇష్ట సఖి అదరాలను చుంబించని మగాడు.. ప్రియుడితో లిప్ లాక్ వేయని ప్రియురాలు ఉంటారా? ఖచ్చితంగా ఉండరనే చెప్పొచ్చు. ముద్దులో ఉన్న మాధుర్యం అలాంటిది మరి. అది ఎలా ఉంటుందో చెప్పడానికి లేదు. అనుభవించాల్సిందే. ఆపై ఆస్వాదించాల్సిందే!గాఢ చుంబనంతో 24 క్యాలరీలు బర్న్ అయిపోతాయన్నది సైంటిఫిక్ ప్రూఫ్. అంతకు మించి ఆనందం అన్నది ఎవర్ గ్రీన్ ప్రూఫ్. అయితే.. ముద్దు వెంట ముప్పుకూడా పొంచి ఉంటుంది. ఈ విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అదేంటీ? ఎలాంటి సమస్యలను తెస్తుంది? అన్నది చూద్దాం.

ప్రతీ మనిషి శరీరంపై కోట్లాది బాక్టీరియా ఉంటుందన్నది తెలిసిందే. ఇందులో అధిక భాగం ఉండేది నోట్లోనే. లిప్ లాక్ వల్ల ఈ బాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ ఫర్ అవుతుంది. దాని వల్ల ఫ్లూ వంటివి ఎదుటి వారికి వ్యాపించవచ్చు.

ఇక పెదల పైభాగంలో ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. లిప్ లోపలి భాగంలో చిన్న చిన్న కురుపులు వస్తుంటాయి కొందరికి. దీనికి కూడా ముద్దే కారణం కావొచ్చు. దీనివల్ల మెడ నొప్పి జ్వరం తలనొప్పి వంటి ఇబ్బందులు వస్తాయి. యాంటీ బయాటిక్ వేస్తే తప్ప.. ఇవి తగ్గవు.

వీటితోపాటు దంత సమస్యలు కూడా వస్తాయి. చెడు బ్యాక్టీరియా పంటి సమస్యలకు కారణం అవుతుందన్నది తెలిసిందే. ముద్దు పెట్టుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి చేరిపోతుంది. దీనివల్ల వాళ్లు కూడా డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాల్సి రావొచ్చు.

ఈ సమాచారంతో అద్భుతమైన ముద్దుపై విరక్తి కలిగించామని భావించాల్సిన పనిలేదు. దీన్ని ఒక జాగ్రత్తగా భావించి.. మీ నోటిని దంతాలను ఆరోగ్యంగా తాజాగా ఉంచుకోండి. మీ భాగస్వామి కూడా అలాగే ఉంచేలా చూడండి. అప్పుడు అదర చుంబనాల్లో మునిగితేలుతూ.. మరో లోకంలోకి ఆనందంగా చేరిపోవచ్చు.