Begin typing your search above and press return to search.

ఆర్ క్రిష్ణయ్య్య... ఐరన్ లెగ్ నా...?

By:  Tupaki Desk   |   20 May 2022 3:30 PM GMT
ఆర్ క్రిష్ణయ్య్య... ఐరన్ లెగ్ నా...?
X
ఆర్ క్రిష్ణయ్య. ఈయన పేరు వినని వారు ఉండరు. ఎందుకంటే బీసీల కోసం చాలా పోరాటాలు చేసిన వ్యక్తి. అన్ని పార్టీల నుంచి ఆయన మీటింగులకు వెళ్ళిన వారు ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన బీసీల హక్కుల కోసం కాకుండా తన సొంత పలుకుబడి పెంచుకోవడం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు అని చాలా మంది తెలుగు రాష్ట్రాలలో అంటున్నారు. దీనికి సంబంధించి ఆయన పొలిటికల్ హిస్టరీ చూస్తే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణా రాష్ట్ర సీఎం అభ్యర్ధి అనేసరికి అతను టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక అలా గెలిచిన తరువాత ఆయన తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాను, బీసీల హక్కుల కోసం పోరాడుతా అని మళ్లీ చెప్పారు. ఇక మరికొన్నాళ్ళ తరువాత హుజూరాబాద్ ఎన్నికల్లో టీయారెస్ కి ఓటు వేయండి అని పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు అయితే అక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి ఫుల్ మెజారిటీ వచ్చింది. ఇక్కడ చిత్రమేంటి అంటే హుజూరాబాద్ లో మొత్తం ఓట్లలో 66 శాతం నుంచి డెబ్బై శాతం ఓట్లు బీసీలవే ఉన్నాయి.

మరి ఇంత పెద్ద సంఖ్యలో బీసీల ఓట్లు ఉన్న చోట క్రిష్ణయ్య ఇచ్చిన పిలుపు కానీ ఆయన మాట కానీ అసలు చెల్లలేదు. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో జగన్ పార్టీకి ఆర్ క్రిష్ణయ్య మద్దతు ఇచ్చారు. అయితే అప్పటికే ఏపీ జనాలు జగన్ కి ఒక్క సారి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు. అయితే ఈ గెలుపులో క్రెడిట్ మాత్రం క్రిష్ణయ్యకు వచ్చింది అని ఏపీ బీసీ నాయకులు అంటున్నారు.

ఇంతకీ ఏపీ ఎన్నికల్లో క్రిష్ణయ్య ఎక్కడైనా తిరిగి వైసీపీకి ప్రచారం చేశారా అని కూడా వైసీపీలోని బీసీ సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇక క్రిష్ణయ్యను సీఎం అభ్యర్ధిగా ముందు పెట్టి 2014 ఎన్నికల్లో తెలంగాణాలో టీడీపీ ఓడిపోయింది. ఇక హుజూరాబాద్ ఎన్నికల్లో పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి క్రిష్ణయ్య టీయారెస్ కి ఓటు వేయమని బీసీ జనాలను కోరినా కూడా అక్కడ టీయారెస్ ఓడిపోయింది. బీసీలు ఎవరూ క్రిష్ణయ్య మాట విని ఓట్లు వేయలేదు.

ఒక విధంగా చూస్తే ఇపుడు తెలంగాణాలోని బీసీలు క్రిష్ణయ్యను పట్టించుకోవడంలేదనే అంటున్నారు. అక్కడ వేరే బీసీ సంఘాల నేతలు తమ బలాన్ని గుర్తింపును పెంచుకుంటున్నారు. ఇలా అవుట్ డేటెడ్ అయిన బీసీ నేత క్రిష్ణయ్యను తెచ్చి వైసీపీలో రాజ్యసభ ఇచ్చి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు అని వైసీపీలోని బీసీలు అంతా అనుకుంటున్నారు.

మొత్తానికి చూస్తే ఇపుడు క్రిష్ణయ్య ఎక్కడ కాలు పెడితే అక్కడ ఓటమి అన్న యాంటీ సెంటిమెంట్ అయితే ఉంది అని అంటున్నారు. క్రిష్ణయ్యను హఠాత్తుగా తీసుకువచ్చి ఏపీలో రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా తమ అవకాశాలకు గండి కొట్టారని వైసీపీలో సీనియర్ బీసీ నేతలు వాపోతున్నారు. చూడాలి మరి క్రిష్ణయ్య బీసీ వైభవం ఏపీలో వైసీపీని ఏ తీరాలకు చేరుస్తుందో అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది.