Begin typing your search above and press return to search.

ప్రకాశం జిల్లా బానిస బతుకేనా?

By:  Tupaki Desk   |   18 Aug 2020 12:30 PM IST
ప్రకాశం జిల్లా బానిస బతుకేనా?
X
ఆకలేస్తే భూమివైపు.. దాహం వేస్తే ఆకాశం వైపు చూసే బతుకులు కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఎందుకంటే ఒక్క పెద్ద సాగునీటిపారుదల ప్రాజెక్టు జిల్లాలో లేదు. నీటి వసతులు లేవు. మెట్ట ప్రాంతం కావడంతో వర్షాలు పడితేనే పంటలు పండుతాయి. లేదంటే బతుకులు ఎండుతాయి.. ఎండాకాలం నీటి గోస.. అనంతపురం తర్వాత అత్యంత దుర్భిక్షిమైన ప్రాంతం ప్రకాశం జిల్లానే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అందరికీ అన్నీ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లా విషయంలో ఎందుకీ చిన్నచూపు చూస్తోందన్న ఆవేదన ఆ జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది.

ప్రకాశం జిల్లా మూడు జిల్లాల కలగూర గంపలాగా ఉంది. మూడు ఏరియాల్లో మూడు యాస భాషలతో మిళితం అయ్యి ఉంటుంది. పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లా గాలి ఉంది. ఇక కొంతభాగం నెల్లూరు ప్రభావితం ఉంది. ఇంకొక కొంత భాగం గుంటూరును ఆనుకొని ఆ వ్యవహారిక వ్యాప్తిలో ఉంది. దీంతో ప్రకాశం జిల్లా మూడు ప్రాంతాల మిళితంగా ఉంది.

అయితే ఎవరి భాష వాళ్లది.. ఎవరి బతుకులు వాళ్లవి.. జిల్లాలో వలస కులాలు ఎక్కువ. స్వాతంత్య్రం వచ్చిన 74 ఏళ్లు తర్వాత కూడా ఇప్పటి వరకు ఏ పార్టీ వచ్చినా అభివృద్ధి మాత్రం లేదని అక్కడి వాసులు వాపోతున్నారు.

ప్రకాశంలో ఒక్క పరిశ్రమ లేదు. ఒక్క ఇన్ స్టిట్యూట్ రాలేదు. బతుకులు బాగు చేయరు.. ఎందుకంటే పార్టీలన్నీ ప్రకాశం జిల్లాని చిన్నచూపులు చూస్తున్నాయి. ప్రకాశం జిల్లా ప్రజల బతుకులు బాగు చేయాలన్న ఆసక్తి ఎవరూ చూపడం లేదు. రాజకీయాలకు మాత్రమే ప్రకాశం జిల్లా పనికి వస్తుందన్న అపప్రదను మూటగట్టుకుంది. అభివృద్ధికి మాత్రం నోచుకోకుండా జిల్లా వెనుకబడి పోతోందని ప్రజల్లో నిరాశ, నిర్వేదం వ్యక్తం అవుతోంది.