Begin typing your search above and press return to search.

పీకే పొలిటిక‌ల్ బ్రోక‌ర్ నా?

By:  Tupaki Desk   |   25 April 2022 12:30 PM GMT
పీకే పొలిటిక‌ల్ బ్రోక‌ర్ నా?
X
జాతీయ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా.. త‌న‌కంటూ.. ప్ర‌త్యేక ముద్ర వేసుకున్న ప్ర‌శాంత్ కిశోర్.. ఉర‌ఫ్ పీకే.. ఇప్పుడు రాజ‌కీయ బ్రోక‌ర్‌లా మారిపోయారా? ఆయ‌న చేస్తున్న ప‌నులు, వేస్తున్న అడుగులను గ‌మ‌నిస్తే... ఇలానే ఆయ‌న వ్య‌వ‌హారం ఉంద‌ని సోష‌ల్ మీడియా విమ‌ర్శ‌కులు అంటున్నారు. ఎందుకంటే.. బీజేపీని .. ఓడించాల‌నేది పీకే వ్యూహం. కేంద్రంలో ప‌ట్టుబ‌ట్టి.. పీకేనే బీజేపీని అధికారంలోకి తీసువ‌చ్చారు. 2014లో ఆయ‌న వ్యూహాలైన చాయ్ పే చ‌ర్చ వంటి కార్య‌క్ర‌మాల‌తోనే మోడీ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చారు.

అయితే.. త‌ర్వాత‌.. పీకేకి.. ప్ర‌ధాని మోడీకి మ‌ధ్య వ్య‌వ‌హారం చెడిపోయింది. దీంతో ఆయ‌న ఇత‌ర పార్టీల తో చేతులు క‌లిపి.. మోడీని గ‌ద్దె దింపాల‌ని చూస్తున్నారు. అయితే.. దీనికి అనుస‌రిస్తున్న వ్యూహంపైనే ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. ఒక మ‌గాడి మాదిరిగా నేరుగా మోడీని ఢీ కొట్టి.. కేంద్రంలో బీజేపీని గ‌ద్దె దించ కుండా.. డొంక తిరుగుడు వ్య‌వ‌హారం చేస్తున్నార‌నేది ప్ర‌ధానంగా వినిపిస్తున్న విమ‌ర్శ‌. ఇదే విష‌యాన్ని చాలా మంది ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు... దాదాపు 50 ద‌శాబ్దాల‌కు పైగా ఈ దేశాన్ని పాలించిన 125 సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్‌కు పీకే కావాలా? అనేది కూడా సోష‌ల్ మీడియా విమ‌ర్శకుల నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న‌.

ఇక‌, తెలంగాణను సాధించ‌డంలో అనేక ఆటు పోట్లు ఎదుర్కొన్న కేసీఆర్‌కు కూడా పీకే అవ‌స‌ర‌మా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే... పీకే ఒక్క‌రోజు కూడా ప్ర‌జాప్ర‌తినిధిగా లేరు. ప్ర‌జ‌ల నుంచి ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్న‌ది కూడా లేదు. క‌నీసం వార్డు స‌భ్యుడిగా కూడా ఆయ‌న విజ‌యం ద‌క్కించుకోలేదు. అలాం టి నేత ఇప్పుడు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త వీటిని న‌డిపించ‌డం ఏంటి? తాత‌కు ద‌గ్గులు నేర్పించిన‌ట్టుగా ఉంద‌ని వ్యంగ్యాస్త్రాలు సంధి్స్తున్నారు.

అంతేకాదు.. దేశంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ఉన్న ప్రాంతీ య పార్టీల‌ను ఏకం చేసే ప‌నిచేయ‌డాన్ని కూడా త‌ప్పు బ‌డుతున్నారు. ఇది బ్రోక‌రేజీ ప‌నులు కావా? అని సోష‌ల్ మీడియా విమ‌ర్శ‌క‌కులు నిల‌దీస్తున్నారు. ఆయ‌న ఈ విష‌యంలో బ్రోక‌ర్‌గా బాగానే ప‌నిచేస్తున్నార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే అస‌లు పీకే ఎలా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఆయ‌న ఏవిధంగా రాజ‌కీయ‌వ్యూహ‌క‌ర్త‌గా ఎదిగారు? అనే చ‌ర్చ కూడా ప్రారంభ‌మైంది. అస‌లు 2014లో ఐఐటీయెన్ అయిన‌.. పీకేని .. రాజకీయాల‌కు ప‌రిచ‌యం చేసింది.. మోడీనే.

అప్ప‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పీకేను వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చెప్పిన ఒక‌టి రెండు కార్య‌క్ర‌మాలునిర్వ‌హించారు. కానీ, మోడీ ఇమేజే ప్ర‌ధానంగా ప‌నిచేసింది. కానీ, పీకే మాత్రం మోడీ గెలుపును త‌న ఖాతాలో వేసుకుని ప్ర‌చారం చేశారు. ఆ త‌ర్వాత‌.. రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీ బ‌ల‌హీన‌త‌ల‌ను గుర్తించి.. వారికి మ‌త‌, ప్రాంతీయత అంటూ.. రెచ్చ‌గొట్టి గెలిపించాడ‌ని.. సోష‌ల్ మీడియా విమ‌ర్శ‌కులు చెబుతున్నారు. ఇంత‌కు మించి ఏముందని అంటున్నారు.

ఏపీ విష‌యాన్ని చూస్తే.. ఉచిత ప‌థ‌కాల‌కు.. భారీ ఎత్తున ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచే కార్య‌క్ర‌మాల‌కు.. నాంది ప‌లికింది పీకే. ఇవే ఆయ‌న‌కు వైసీపీకి ఇచ్చిన అమూల్య‌మైన స‌ల‌హాలు. అయితే.. వీటి వల్లే.. ఇప్ప‌డు రాష్ట్రం అప్పుల పాలైంద‌ని.. మేధావులు చెబుతున్నారు. కేవ‌లం పీకే స‌ల‌హాల‌తో అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌తో అప్పుల‌పై అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు పీకే తెలంగాణ‌లో అడుగులు వేస్తున్నాడు. ఇక్క‌డ కూడా ఇలాంటి ప‌థ‌కాల‌తోనే.. రాష్ట్రాన్ని నాశనం చేస్తాడా? అని సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ ప‌ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు.. పీకే దేశానికి ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అంటున్నారు. అత‌ని ఆలోచ‌న అంతా.. రాజకీయ పార్టీల‌ను గెలిపించ‌డం కోస‌మే త‌ప్ప‌.. దేశం కోసం... ప్ర‌జ‌ల కోసం కాద‌ని చెబుతున్నారు. అంతేకాదు... రాష్ట్రం అభివృద్ధి చెందేలా ఒక్క‌టంటే.. ఒక్క స‌ల‌హా కూడా ఇవ్వ‌క‌పోవ‌డ గ‌మ‌నార్హ‌మ‌ని దుయ్య‌బ‌డుతున్నారు. క‌నీసం యువ‌త‌కు ఉపాధి క‌ల్ప‌న‌, ఉద్యోగ క‌ల్పన.. అదేవిధంగా ఇప్ప‌టికే ఉన్న అప్పుల‌ను ఎలా తీర్చాల‌నే స‌ల‌హాలు కూడా ఆయ‌న‌కు తెలియ‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఏదేమైనా... పీకే ఈ దేశాన్ని శ్రీలంక మాదిరిగా చేయ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు.