Begin typing your search above and press return to search.
ఫైజర్ టీకా ఇండియాకు వచ్చేస్తోందా? అసలు నిజం ఏమిటి?
By: Tupaki Desk | 4 Dec 2020 1:24 PM ISTప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేస్తుందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. మేము ముందు తీసుకొస్తున్నామంటూ రష్యా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను ప్రకటించింది. అయితే ఈ వ్యాక్సిన్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని సమాచారం. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. మనదేశంలోనూ సీరం ఇన్స్టిట్యూట్, భారత్‌బయోటెక్ వ్యాక్సిన్ తయారీ లో ముందున్నాయి. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన వ్యాక్సిన్ మాత్రం అమెరికా తయారు చేసిన ‘ఫైజర్’ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ అన్ని దశల క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు సాధించినట్టు సమాచారం.
మరోవైపు ఈ వ్యాక్సిన్‌ను బ్రిటన్ ప్రభుత్వం కూడా ఆమోదించింది. త్వరలోనే అక్కడ వ్యాక్సినేషన్ చేయబోతున్నారు. బ్రిటన్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని తెలియగానే పలువురు ధనవంతులైన భారతీయులు బ్రిటన్‌కు పయనమయ్యారు. ఇందుకోసం పలు ట్రావెల్ కంపెనీలు కూడా ఆఫర్లతో ముందుకొచ్చాయి. అయితే ఈ ఫైజర్ వ్యాక్సిన్ ఇండియాలోకి కూడా అందుబాటులోకి రాబోతున్నదని .. ఈ వ్యాక్సిన్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆమోదించబోతున్నదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం ఇంతవరకు రాలేదు. డిసెంబర్ 15 తర్వాత బ్రిటన్ వచ్చే విదేశీయులంతా కచ్చితంగా వారం రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సిందే అనే నిబంధన పెట్టింది. అయితే ఫైజర్ వ్యాక్సిన్ మనదేశంలో నిల్వ చేసే అవకాశం ఉన్నదా? అందుకోసం మనవద్ద తగిన పరికరాలు ఉన్నాయా? లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఫైజర్ టీకాను -70 డిగ్రీల ఉష్టోగ్రతలో మాత్రమే నిల్వ చేసుకోవాలని కంపెనీ హెచ్చరించింది. అయితే టీకా వేయించుకొనేందుకు లక్షలు ఖర్చుపెట్టుకొని విదేశాలకు వెళ్లేందుకు భారతీయులు సిద్ధపడిన నేపథ్యంలో ఆ వ్యాక్సిన్ ను ఇండియా కే తీసుకొస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం అయితే రాలేదు.