Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్.. కమల్ హాసన్ ను ఫాలో అవుతున్నాడా?
By: Tupaki Desk | 13 May 2021 8:00 PM ISTచింత చచ్చినా పులుపు చావని నేతలు ఇద్దరు ఉన్నారని రాజకీయవర్గాల్లో ఓ టాక్ ఉంది. తెలుగులో పవన్ కళ్యాణ్. తమిళనాట కమల్ హాసన్. ఇద్దరూ భీకరంగా హైప్ తీసుకొచ్చి ఎన్నికల్లో పోటీచేసి ఇద్దరూ ఓడిపోయినవారేనంటున్నారు. అయితే పవన్ జనసేన పార్టీ ఒక్క సీటు గెలవగా.. తమిళనాట ఆ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది కమల్ పార్టీ. ఇరు పార్టీల సారథులు ఎన్నికల్లో గెలవలేకపోవడమే ఇక్కడ ఘోరమైన అవమానంగా ుంది. అందుకే ఇప్పుడు ఈ హీరోలు కం పొలిటీషియన్లు రాజకీయాలను త్యజించాలని యోచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. కమల్ హాసన్ అయితే అదే దృష్టితో ఉన్నట్టు టాక్.
కమల్ హాసన్ ఓడిపోయిన తర్వాత రాజకీయ దుకాణం మూసివేయాలని డిసైడ్ అయ్యారట.. ఇక ఈ రాజకీయాలు మనకు అచ్చిరావని కమల్ హాసన్ అనుకుంటున్నట్టు తమిళనాట మీడియా కోడై కూస్తోంది. అందుకే ఇప్పుడు కమల్ ఆగిపోయిన తన ‘ఇండియన్2’ సినిమాను తిరిగి పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. దర్శకుడు శంకర్ తో ఇదే విషయంపై చర్చలు జరుపుతున్నాడట..
ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కమల్ హాసన్ ను ఫాలో అవ్వాలని యోచిస్తున్నారు!. పవన్ ఏకంగా గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీచేసి మరీ ఓడిపోయాడు. అలాగే మొన్న జరిగిన తిరుపతి ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి సపోర్టు చేశాడు. అక్కడ కూడా జనసేన సపోర్టు చేసినా కూడా పోయిన సారి వచ్చిన ఓట్లు కూడా రాలేదంట.. కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ కూడా దుకాణం మూసివేస్తాడా? అని ఆలోచిస్తున్నట్టు పలువురు అనుకుంటున్నారు.
జనసేన ఓటు బ్యాంకు టీడీపీకి వెళ్తోందని తిరుపతి ఎంపి ఎన్నికల్లో తేలిపోయిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట.. అందుకే ఇప్పుడు పార్టీ కోసం సమయం కేటాయించకుండా సినిమాల్లోనే బిజీ కావాలని పవన్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.