Begin typing your search above and press return to search.

ఎన్సీపీ డ్ర‌గ్స్‌ కి స‌పోర్టు చేస్తుందా?

By:  Tupaki Desk   |   24 Oct 2021 8:30 AM GMT
ఎన్సీపీ డ్ర‌గ్స్‌ కి స‌పోర్టు చేస్తుందా?
X
డ్ర‌గ్స్‌.. మాద‌క‌ద్ర‌వ్యాలు.. ఇవి ఏరూపంలో ఉన్నా.. అంద‌రూ వ్య‌తిరేకించాల్సిందే. ఎందుకంటే.. వీటికి బానిస‌ల‌వుతున్న యువ‌త‌.. మ‌త్తులో జోగుతూ చేస్తున్న అకృత్యాలు పెరిగిపోతున్నాయ‌ని.. జాతీయ నేర‌గణాంకా శాఖ స్ప‌ష్టం చేస్తోంది. అవి అత్యాచారాలే కాన‌క్క‌ర‌లేదు.. దాడులు.. దొమ్మీలు, హ‌త్య‌లు.. దొంగ‌త నాలు.. కుటుంబ క‌ల‌హాలు... త‌ర్వాత‌.. ర‌గ‌డ‌.. వంటివి కామ‌న్‌గా మారిపోయాయ‌ని.. ఈ శాఖ హెచ్చరిస్తోంది. ఇటీవ‌ల యూపీలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌లో.. ఓ యువ‌కుడు.. గంజాయి మ‌త్తులో చేసిన ఘోరం.. ఓ నిండు కుంటుంబాన్ని బ‌లితీసుకుంది.

ఇలా.. దేశంలో అనేక రాష్ట్రాల్లో మాద‌క ద్ర‌వ్యాల వినియోగం పెరిగిపోయింది. ఈ నేప‌థ్యంలో మాద‌క ద్ర‌వ్యా లపై కేంద్ర ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపాల‌ని నిర్ణ‌యించింది.ఈ క్ర‌మంలోనే అన్ని రాష్ట్రాల్లోనూ డ్ర‌గ్స్ వినియోగం పై పోలీసులు.. ప్ర‌భుత్వాలు కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక‌, రాజకీయంగా చూసినా.. ప్ర‌తి ఒక్క‌రూ దీనికి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే.. చిత్రంగా.. మ‌హారాష్ట్ర‌లోని నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్(ఎన్సీపీ) మాత్రం చిత్రంగా వ్యాఖ్యానించింది. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో మాద‌క ద్ర‌వ్యాల క‌ల‌క‌లం రేగింది. క్రూజ్ షిప్‌లో.. పార్టీ చేసుకుంటున్న వారిపై దాడులు చేసిన ఎన్‌సీబీ అధికారులు.. షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్‌ను ఖాన్‌ను అరెస్టు చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు ఏ కోర్టూ బెయిల్ ఇవ్వ‌లేదు. అయితే.. ఈ విష‌యంలో వేలు పెట్టిన ఎన్సీపీ.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. మాద‌క ద్ర‌వ్యాల విష‌యంలో అన్ని రాజ‌కీయ పార్టీలూ.. ఒకే విధంగా మాట్లాడాల్సి ఉండ‌గా.. ఎన్సీపీకి చెందిన మ‌హారాష్ట్ర మంత్రి చ‌గ‌న్ భుజ్‌బ‌ల్‌.. ఆస‌క్తిక‌ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ బీజేపీలో చేరినట్లైతే డ్రగ్స్ పంచదార పౌడర్ అవుతుందని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. డ్రగ్స్ కేసులో షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో 3,000 కిలోల డ్రగ్స్ దొరికిన విషయాన్ని చ‌గన్ ప్రస్తావిస్తూ క్రూజ్ షిప్‌ పైనే ఎన్సీబీ ఎందుకు దృష్టి పెట్టిందని ప్రశ్నించారు.

``వందల, వేల కిలోల డ్రగ్స్ బయటపడుతున్నాయి. నిన్నటికి నిన్న గుజరాత్‌ లోని ముంద్రా పోర్ట్‌ లో 3,000 కిలోల డ్రగ్స్ సీజ్ చేశారు. అయితే ఎన్సీబీ ఒక్క ముంబైనే టార్గెట్ చేసింది. క్రూజ్ షిప్‌లో దొరికిన డ్రగ్స్ చాలా తక్కువ. కాకపోతే దీనిపై దృష్టి సారించడం కక్షపూరితమే. ఒకవేళ షారూఖ్ ఖాన్ బీజేపీలో చేరితే ముంబైలోని డ్రగ్స్ పంచదార పౌడర్ అయిపోతాయి కూడా’’ అని భుజ‌బ‌ల్ అన్నారు. అయితే.. ఈవ్యాఖ్య‌లపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. స‌మాజానికి ప్రమాద‌క‌రం వంటి డ్ర‌గ్స్ విష‌యంలోనూ రాజ‌కీయాలు చూసుకుంటారా? అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంద‌రూ కల‌సి క‌ట్టుగా.. మాద‌క ద్ర‌వ్యాల‌ను ఏరిపారేయాల్సిన స‌మ‌యంలో ఇలా .. ఈ విష‌యాన్ని కూడా రాజ‌కీయం చేయ‌డం.. స‌రికాద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

నిజానికి ఇంత పెద్ద ఎత్తున జ‌రుగుతున్న దందాను ప‌ట్టుకున్న అధికారుల‌ను అభినందించాల్సిన మంత్రి వ‌ర్యులు.. ఇలా రోడ్డున ప‌డి.. కేవ‌లం మ‌హారాష్ట్ర‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అని ప్ర‌శ్నించ‌డం స‌బ‌బు కాద‌ని అంటున్నారు ప్ర‌జాస్వామ్య వాదులు. అంటే.. దీనిని బ‌ట్టి ఎన్సీపీ వాళ్లు డ్ర‌గ్స్‌ను స‌పోర్టు చేస్తున్నారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. మ‌రిదీనిపైనా మంత్రి క్లారిటీ ఇచ్చే స్తే.. బెట‌ర్ క‌దా... అంటున్నారు. దేశంలో ఎక్క‌డైనా .. మాద‌క ద్ర‌వ్యాల వినియోగం.. ర‌వాణా.. విక్ర‌య‌దారుల‌పై ఉక్కుపాదం మోపాల్సిన నాయ‌కులే ఇలా.. మాద‌క ద్ర‌వ్యాల‌కు మ‌ద్ద‌తుగా.. రాజ‌కీయ కోణంలో.. విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం.. ఎంత వ‌ర‌కు స‌బ‌బు..? అనేది ప్ర‌శ్న‌.