Begin typing your search above and press return to search.

నాయిని నర్సింహారెడ్డి పార్టీ మారుతాడా?

By:  Tupaki Desk   |   30 Jun 2020 10:00 AM IST
నాయిని నర్సింహారెడ్డి పార్టీ మారుతాడా?
X
ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట నడిచాడు. అండగా నిలబడ్డాడు. కేసీఆర్ పై ఈగ వాలనిచ్చేవాడు కాదు నాయిని నర్సింహారెడ్డి. అందుకే కేసీఆర్ కూడా నాయిని అన్నా అని ముద్దుగా పిలిచేవాడు. తెలంగాణ ఏర్పడ్డాక తొలి తెలంగాణ కేబినెట్ లో ఎమ్మెల్యేగా గెలవకపోయినా సరే కేసీఆర్ ఈ టీఆర్ఎస్ సీనియర్ నేతకు పెద్ద పీట వేశారు. ఏకంగా తన తర్వాత కీలకమైన హోంమంత్రి పదవిని కట్టబెట్టాడు. ఐదేళ్ల పాటు తెలంగాణ తొలి హోంమంత్రిగా నాయిని నర్సింహారెడ్డికి హానీమూన్ లా సాగింది. కేసీఆర్ నమ్మినబంటుగా అప్పుడు నాయిని వ్యవహరించారు.

అయితే రెండో దఫా కేసీఆర్ వచ్చాక సీనియర్లను పూర్తిగా పక్కనపెట్టారు. నాయినియే కాదు.. కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి.. ఇలా టీఆర్ఎస్ లోని సీనియర్లను పక్కనపెట్టి యువకులకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. నాయిని తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినందుకు అలిగి అప్పట్లో కేసీఆర్ పై విమర్శలు చేశాడు. తన అల్లుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వనందుకు కేసీఆర్ పై నాయిని నోరు పారేసుకున్నారు. అయితే ఆ తర్వాత అంతా సర్దుకుంది.

అయితే తాజాగా నాయిని నర్సింహారెడ్డి ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. ఆయనను తన ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయమని అడిగితే కుదరదు అని కేసీఆర్ అన్నట్టు టాక్. మీ అల్లుడిని కావాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ చేస్తానులే అని అన్నాడట.. దీంతో ఎమ్మెల్సీ పోయి.. అల్లుడికి సీటు పోయి నాయిని నర్సింహారెడ్డి పార్టీ మారాలని డిసైడ్ అయ్యాడు అని. ఉద్యమకాలం నుంచి ఉన్న తనను కేసీఆర్ అవమానించాడని.. నా తఢకా ఏంటో చూపిస్తాను అని అంటున్నాడని టాక్. ఇలా నెత్తిన పెట్టుకున్న కేసీఆరే కాలదన్నే సరికి నాయిని కారాలు మిరియాలు నూరడానికి రెడీ అయ్యారట.. అదీ సంగతీ.!