Begin typing your search above and press return to search.

షాకింగ్ : అనిల్ అంబానీకి అన్న ముఖేస్ సాయం చేయలేదా?

By:  Tupaki Desk   |   9 Oct 2020 12:15 PM IST
షాకింగ్ : అనిల్ అంబానీకి అన్న ముఖేస్ సాయం చేయలేదా?
X
ముఖేష్ అంబానీ.. దేశంలోనే అపర కుబేరుడు. ఆయన సంపద గంటల లెక్కన పెరిగిపోతోంది. తన వ్యాపార చతురతతో సంపదను భారీగా పోగేసుకుంటున్నారు. అయితే ఆయన తమ్ముడు మాత్రం రోజురోజుకు అప్పుల పాలవుతూ ఆర్థికంగా చితికి పోతున్నాడు.

అన్నాదమ్ములు అనిల్, ముఖేష్ లు విడిపోయాక.. ముఖేష్ సంపద పెంచుకుంటూ దేశంలోనే అపరకుబేరుడయ్యాడు. ఆయిల్ నుంచి అన్ని రంగాల్లో లాభాలు గడిస్తున్నారు. అదే సమయంలో అనిల్ అంబానీ ఆస్తులు కరిగిపోయి అప్పుల పాలయ్యాడు. ఎస్బీఐ నుంచి మూడు చైనా బ్యాంకులకు వేల కోట్లు అప్పులు చెల్లించాల్సి వచ్చింది. ఇటీవల అప్పులు తీర్చడానికి తన వద్ద ఎలాంటి ఆస్తులు లేవని లండన్ కోర్టుకు అనిల్ అంబానీ తెలిపారు.

ఇక గత ఏడాది ఎరిక్సన్ బకాయిల కేసులో ముఖేష్ అంబానీ తన తమ్ముడైన అనిల్ అంబానీ జైలుకు వెళ్లకుండా వందల కోట్లను సాయం చేశాడని పరిశ్రమ వర్గాల్లో ఓ టాక్ ఉంది. అయితే తాజాగా తమ్ముడికి ఆర్థికంగా సాయం చేయలేదని తేలింది.

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కాం)కు చెందిన కార్పొరేట్ ఆస్తులను ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కు లీజుకు ఇవ్వడం ద్వారా దాదాపు రూ.460 కోట్లు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. తమ్ముడు అనిల్ కు ఈ లీజు ద్వారా బకాయిలను అన్న చెల్లించారు.

అయితే ఎరిక్సన్ కేసులో జైలుకు వెళ్లకుండా ముఖేష్ అంబానీ నుంచి అనిల్ కు నిధులు రాలేదని చెబుతున్నారు. 2019, మార్చి 18న స్వీడన్ టెలికాం కంపెనీకి రూ.458.77 కోట్ల బకాయిలను చెల్లించకపోతే అనిల్ అంబానీ జైలుకు వెళ్లాల్సి ఉండేది. ఆ సందర్భంలో అనిల్ అంబానీకి అన్న ముఖేష్ అంబానీ అండగా నిలిచాడని.. ఆ సొమ్ము చెల్లించాడని వార్తలు వచ్చాయి. అనిల్ అంబానీ కూడా ట్విట్టర్ లో అన్నకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు.

అయితే అది నిజం కాదని తేలింది. ఏడాదిన్నర తర్వాత అనిల్ అంబానీ ఆర్.కామ్ గ్రూప్ అధికార ప్రతినిధి మాత్రం కార్పొరేట్ ఆస్తుల లీజింగ్ ద్వారా బకాయిలు చెల్లించినట్లు చెబుతున్నారు. అనిల్ అంబానీని ఆర్థిక ఉచ్చు నుండి కాపాడినప్పటికీ అది బిజినెస్ కోణంలోనే అని అభిప్రాయపడుతున్నారు. ఇరువురు అన్నాదమ్ముల మధ్య సంబంధాలు అంత బాగా లేవని అంటున్నారు.