Begin typing your search above and press return to search.

ఉద్యమ నేత.. ఆ గట్టునుంటావా? ఈ గట్టుకు వస్తావా?

By:  Tupaki Desk   |   3 Sept 2020 3:00 PM IST
ఉద్యమ నేత.. ఆ గట్టునుంటావా? ఈ గట్టుకు వస్తావా?
X
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాడి వదిలేశారు. కాపుల కొట్లాటలు.. కాపు రాజకీయాల్లో తాను బలికాలేను అంటూ పదవిని త్యజించాడు. తనపై దుష్ప్రచారం చేస్తున్నందుకు మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నారు. దానివెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో కానీ ఆయన మాత్రం పక్కకు జరిగారన్న ప్రచారం ఉంది.

ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక సతమతమవుతున్నాడంట.. వైసీపీలోకి వెళితే ఎమ్మెల్సీ ఇస్తామన్నారంట.. కాపు మంత్రులు టచ్ లోకి వెళ్లి చర్చలు చేశారంట.. కొడుకు కానీ.. కోడలికి కానీ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఇస్తాం అని.. ఆ తరువాత ఎమ్మెల్యే సీటు ఇస్తామని మాట ఇచ్చారని ప్రచారం సాగుతోంది.

అయితే బీజేపీ కూడా చర్చలు జరుపుతోందని టాక్ వినిపిస్తోంది. అసలే ముద్ర మీద కేంద్రప్రభుత్వం రైల్వే కేసులు పెట్టింది. అవి పోవాలంటే బీజేపీలోకి వెళితే మంచిది అని కొందరు సూచిస్తున్నారట.. ఇంకొందరు అలా చేరితే ఉద్యమ ద్రోహం చేసి జాతికి అన్యాయం చేసినట్టు అవుతుంది అని కూడా అంటున్నారట..

మొత్తానికి ఆ గట్టున ఉంటావా? ఈ గట్టుకి వస్తాడో అని పార్టీలలో ముద్రగడ గురించి ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. ముద్రగడకు కాపుల్లో ఉన్న బలం - ఐక్యత చూసి ఆయనను లాగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారట.. మరి ఈయన ఎటువైపు వెళుతాడన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.