Begin typing your search above and press return to search.

అరవింద్.. భయపడ్డాడా? భయపెడుతున్నాడా?

By:  Tupaki Desk   |   23 Dec 2019 6:23 PM IST
అరవింద్.. భయపడ్డాడా? భయపెడుతున్నాడా?
X
నిజామాబాద్ ఎంపీ, బీజేపీ ముఖ్య నేత అరవింద్ బయటే కాదు.. మీడియా ఎదుట కూడా అదే దురుసు, దుందుడుకు స్వభావాన్ని కనబర్చారు. సీనియర్ జర్నలిస్టు మీదకే కోపంతో ఉరిమిచూశారు.. కఠినంగా సమాధానాలిచ్చి బెంబేలెత్తించారు.

తాజాగా ఓ మీడియాలో ఇంటర్వ్యూలో మాట్లాడిన అరవింద్ కు ఓ సూటి ప్రశ్న ఎదురైంది. అధికారంలోకి వస్తే ఐదు నెలల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న ఎంపీ అరవింద్.. ఆరు నెలలు అయినా ఎందుకు తేలేదని.. రాజీనామా చేస్తానన్నారు కదా అని ప్రశ్నిస్తే అరవింద్ సీరియస్ అయ్యారు. పసుపు బోర్డు కంటే మెరుగైన దాన్ని రైతులకు తీసుకురావడానికి కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని.. రైతులు ఆగాలని దురుసుగా సమాధానమిచ్చారు.

సదురు జర్నలిస్టు దీనిపై గుచ్చి గుచ్చి అడిగితే.. నా బాడీలో మీ పసుపు బుల్లెట్లు దిగవంటూ సీరియస్ అయ్యారు. కేసీఆర్, టీఆర్ఎస్ తరుఫున వకాల్తా పుచ్చుకొని ప్రశ్నలు అడుగుతున్నారా అని జర్నలిస్టుపైనే లేచారు.

ఏపీ రాజకీయాలపై తానెందుకు స్పందిస్తానంటూ ఎంపీ అరవింద్ రుసరుసలాడారు. కవితను ఓడించానని..వచ్చేసారి కూడా చిత్తుగా ఓడిస్తానని అరవింద్ సవాల్ చేశారు.

మీరు అటు తిప్పి అడిగినా.. ఇటు తిప్పి అడిగినా మీకు దొరకనంటూ జర్నలిస్టుపై ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నేనే నిలబడుతానని.. మీరు రైతుల పక్షాన నిలబడాల్సిన అవసరం లేదని జర్నలిస్టుకు సూటిగానే కౌంటర్ ఇచ్చారు. ఇలా అరవింద్ ను పసుపు బోర్డు తేలేకపోవడంపై ఇరుకునపెడుదామని చూసిన జర్నలిస్టునే మూడు చెరువుల నీళ్లు తాగించాడు అరవింద్..