Begin typing your search above and press return to search.

లోకేష్.. జగన్ ను ఫాలో అవుతున్నాడా?

By:  Tupaki Desk   |   13 May 2021 8:00 PM IST
లోకేష్.. జగన్ ను ఫాలో అవుతున్నాడా?
X
ఎక్కడ తగ్గామన్నది కాదు.. ఎలా నెగ్గాలన్నదే ముఖ్యమని టీడీపీ వ్యూహకర్తలు డిసైడ్ అయ్యారట.. ఈ మేరకు జగన్ స్ట్రాటజీనే ఫాలో అయ్యి సేమ్ అలాగే రాష్ట్రంలో రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నారట.. ఇప్పుడు జగన్ ను ఫాలో అవ్వడానికి లోకేష్ ను రంగంలోకి దించుతున్నారట.. ఏంటా కథా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక.. 2014 ఎన్నికలకు ముందు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన సహా అన్ని పక్షాలు కలిసిపోయి జగన్ ను తిట్టి చంద్రబాబును గెలిపించారు. నాడు గెలవాల్సిన జగన్ అందరూ కూటమి కట్టేసరికి ఓడిపోయాడు. అప్పుడు జగన్ ను అందరూ అలాంటివాడు.. ఇలాంటివాడు అని తీవ్ర అభాండాలు వేసి ప్రజల్లో పలుచన చేసి అన్ని పార్టీల వారు వెలివేసినంత పనిచేశారు.

అయినా జగన్ మాత్రం మారలేదు. అదే మొండి పట్టుదలతో ప్రజల్లోకి వెళ్లాడు. తను అనుకున్న ప్రకారం పనిచేస్తూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీంను ఏర్పాటు చేసుకొని పాదయాత్ర చేసుకొని సొంతంగా ఏపీలో ఏకపక్ష విజయాన్ని సాధించారు. అయితే టీడీపీలో ఇప్పుడు ఇది రిపీట్ అవుతుందట.. టీడీపీ యువ నేత నారా లోకేష్ ను కూడా సీనియర్ టీడీపీ వాళ్లు అందరూ తిడుతున్నారు. అపాయింట్ మెంట్ ఇవ్వరని.. పెద్దంటే గౌరవం ఇవ్వరు అని ఆ రోజు జగన్ ను కాంగ్రెస్ వాళ్లు అందరూ ఇలాగే తిట్టగా.. ఇప్పుడు లోకేష్ ను అదే విధంగా అంటున్నారు.

అయితే లోకేష్ ఏమీ తగ్గకుండా పార్టీ అంతా అతడి గ్రిప్ లో పెట్టుకొని జగన్ ఏ విధంగా చేశాడో అలానే కాపీ కొడుతూ ఎవరిని లెక్క చేయకుండా పనిచేసుకుంటూ సొంతంగా టీం తయారు చేసుకొని ఎన్నికల కంటే 2 సంవత్సరాల ముందు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడంట..

అయితే కొత్తగా నారా లోకేష్ చేయబోయేది ఏంటి అంటే..ప్రతి నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెడుతాడట.. అందులో ప్రజలను బాగా సమీకరించి చంద్రబాబుతో ప్రసంగం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ మేరకు టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ ప్లాన్ చేసినట్టు సమాచారం. అలా వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాజ్యాధికారమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోందని సమాచారం.