Begin typing your search above and press return to search.

రమేశ్ ఆసుపత్రిలో లోకేష్ స్లీపింగ్ పార్ట్ నర్ నా?

By:  Tupaki Desk   |   17 Aug 2020 5:00 PM IST
రమేశ్ ఆసుపత్రిలో లోకేష్ స్లీపింగ్ పార్ట్ నర్ నా?
X
స్వర్ణప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది చనిపోవడం ఏపీలో విషాదం నింపింది. అంతే స్థాయిలో విమర్శలకు దారితీసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. హీరో రామ్ లాంటి వారు కూడా ఇందులో ఇన్ వాల్వ్ అయిపోయారు.

నిజానికి ఏపీలో ఏ ఉపద్రవం జరిగినా.. టీడీపీ, దాని అనుకూల మీడియా రచ్చ రచ్చ చేయడానికి కాచుకు కూర్చున్నాయని చాలా సంఘటనల్లో రుజువైంది. ప్రతీ చిన్న విషయానికి వైఎస్ జగన్ సర్కారును అభాసుపాలు చేయడానికి చంద్రబాబు, ఆయన తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ ముందుంటున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా టీడీపీ రాజకీయాన్ని హీటెక్కిస్తుంది.

అయితే తాజాగా స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం జరిగి 10మంది చనిపోతే టీడీపీ అధినేత చంద్రబాబు కానీ.. నారా లోకేష్ కానీ.. వాళ్ల అనుకూల మీడియా నోరెత్తికపోవడం వెనుక మతలబు ఏంటి చెప్మా అని సోషల్ మీడియా నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఇక మరికొందరేమో.. లోకేష్ కు ఆస్పత్రిలో ఏమైనా పార్ట్ నర్ షిప్ ఉండొచ్చని.. అందుకే ప్రతీ విషయాన్ని కడిగేసే లోకేషం బాబు మౌనముద్ర వహించారని సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే లోకేష్ ఎప్పుడైనా ప్రజలతో మాట్లాడేది.. స్పందించేది కేవలం ట్విట్టర్ లోనే కదా.. అందుకే అందులోనే లోకేష్ బాబు స్పందిస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారట.. కానీ రమేశ్ ఆస్పత్రిపై లోకేష్ మౌనం వెనుక ఏదో మతలబు ఉందన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది.