Begin typing your search above and press return to search.

సోము వైఫల్యం.. కన్నా అందుకే యాక్టివ్ అయ్యారా?

By:  Tupaki Desk   |   24 May 2021 2:30 PM GMT
సోము వైఫల్యం.. కన్నా అందుకే యాక్టివ్ అయ్యారా?
X
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రస్తుతం యాక్టివ్ గానే ఉన్నారు. అయితే ఆయన సారథ్యంలో ఏపీలో ఏ ఒక్క ఎన్నికలోనూ బీజేపీ మెరుగైన ప్రదర్శన చేయలేదు. తెలంగాణలో బండి సంజయ్ నిరూపించుకోగా.. ఏపీలో సోము వీర్రాజుకు గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. దీంతో మళ్లీ పాత కాపులు బీజేపీలో యాక్టివ్ అవుతున్నారు.

బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మళ్ళీ ప్రజల్లోకి రావడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీ యూనిట్ అధ్యక్షుడి పదవి నుంచి కన్నాను తొలగించినప్పటి నుంచి రాజకీయంగా క్రియారహితంగా ఉన్న కన్నా ఆదివారం తొలిసారిగా రెండు గంటల ధర్నా నిర్వహించారు. కోవిడ్ సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో వైయస్ఆర్సిపి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఈ ధర్నా చేశారు. జగన్ సర్కార్ ను విమర్శించడానికి ఆయన మీడియాతో మాట్లాడారు.

అధ్యక్ష పదవి నుండి తొలగించినప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ సైలెంట్ గా ఉన్నాడు. కొంతమంది డైహార్డ్ మద్దతుదారులు తప్ప, ఎవరూ అతనిని కలవడానికి రాలేదు. కానీ, ఆదివారం కన్నా వైయస్ఆర్సిపికి వ్యతిరేకంగా పెద్ద ధర్నానే చేయగా చాలా మంది బీజేపీ శ్రేణులు కదిలిరావడం విశేషం.

కన్నా ధర్నాలో నిప్పులు చెరిగారు. కరోనా నియంత్రణపై జగన్ సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించలేదని కన్నా విమర్శించాడు. కోవిడ్‌ను రాజకీయం చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. సోము వీరరాజు కంటే కన్నా హయాంలోనే పార్టీ చాలా బాగుందని జాతీయ పార్టీ యూనిట్ ఇప్పుడు భావించడం ప్రారంభించడంతో కన్నా మళ్లీ గొంతు పెంచాడని కొంతమంది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కన్నా కిందస్థాయి నుంచి వచ్చిన బలమైన నేత. పార్టీకి కొంత కార్యాచరణ రూపొందించాడు. సోము వీర్రాజు వచ్చినప్పటి నుండి పార్టీ పరిస్థితి ఏపీలో దిగజారిందంటున్నారు. కొందరు బిజెపి పరిశీలకులు సోము ఘోరమైన వైఫల్యంతో కన్నా ఒక అవకాశాన్ని గ్రహించి, మళ్ళీ చురుకుగా మారారని చెబుతున్నారు.