Begin typing your search above and press return to search.
2018 ఎన్నికలంటే కేసీఆర్ హుషారు... ఇప్పుడు బేజారు
By: Tupaki Desk | 2 Aug 2019 7:00 AM ISTతెలంగాణ సీఎం కేసీఆర్ కు గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఎన్నికలంటే మహా హుషారు వచ్చేస్తుంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న టైంలో పదేపదే తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లి ఘనవిజయాలతో గెలవటం ఆయనకు పరిపాటిగా మారిపోయింది. 2014 ఎన్నికలకు ముందు కూడా ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లోకి వస్తే వారితో తమ పదవులకు రాజీనామాలు చేయించి మరి టీఆర్ ఎస్ గుర్తుపై పోటీ చేయించి భారీ మెజార్టీతో గెలిపించారు. 2014 తర్వాత ఇదే పరిస్థితి కొనసాగింది. చివరకు విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మరణిస్తే ఉప ఎన్నికల్లో సైతం టీఆర్ ఎస్ అభ్యర్థులు నిలబెట్టి బంపర్ మెజారిటీతో గెలిపించుకున్నారు.
ఇలా 2018 ముందస్తు ఎన్నికల వరకు కెసిఆర్ కు ఎన్నికలు వస్తున్నాయి అంటే ఆయనలో ఎక్కడా లేని ఆనందం కనిపించేది. వరంగల్- ఖమ్మం- గ్రేటర్ హైదరాబాద్ లాంటి కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కారు స్పీడ్ కు బ్రేక్ ఉండేది కాదు. కేసీఆర్ కు ఎన్నికలంటే ఎంత హుషారో అన్న నానుడి తెలుగు రాజకీయాల్లో బాగా పాపులర్ అయింది. ఏదైనా ఒక ఎన్నికకు వెళ్లి గెలవడం అంటే ఎంత పెద్ద అధికార పార్టీ అయినా కాస్త తటపటాయిస్తూ ఉంటుంది. కేసీఆర్ కు మాత్రం ఎన్నికల్లో గెలవడం మంచినీళ్లు తాగినంత సులువుగా ఉండేది. అయితే ఆయన హుషారుకు తాజా లోక్ సభ ఎన్నికలు బ్రేక్ వేశాయి. కారు - 16 - ఢిల్లీలో తెలంగాణ సర్కారు అన్న నినాదంతో ఎన్నికలకి వెళ్లిన కెసిఆర్ కు మైండ్ బ్లాక్ అయిపోయే రిజల్ట్ వచ్చింది.
టీఆర్ ఎస్ కేవలం 9 సీట్లతో ( అందులో కూడా రెండు చచ్చీ చెడి గెలిచిన సీట్లు ) సరిపెట్టుకుంది. కుమార్తె కవిత ఓడిపోయారు. బీజేపీ ఏకంగా 4 సీట్లు, కాంగ్రెస్ 3 సీట్లు గెలిచాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ ఎస్ గెలిచినా... ఇప్పుడు పట్టణ జనాభా ఓట్లేసి ఎన్నుకునే మున్సిపల్- కార్పొరేషన్ ఎన్నికలు జరిపేందుకు కేసీఆర్ తటపటాయిస్తున్నట్టే కనిపిస్తుంది. ఎనిమిది నెలల క్రితం తెలంగాణలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని రెండోసారి ఏర్పాటు చేసిన కారు పార్టీ జోరు ఇప్పుడు లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పల్లెల్లో కంటే పట్టణాల్లో టీఆర్ ఎస్ తీవ్రమైన వ్యతిరేకత ఉంది.
మున్సిపల్ ఎన్నికల్లో పరిస్ధితులు టీఆర్ ఎస్ కు అనుకూలంగా లేవని ముఖ్యమంత్రికి నివేదికలు అందుతున్నారు. రాష్ట్రంలోని 132 మున్సిపాలిటీలు, ఆరు నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక కమలనాథులు పట్టణ ప్రాంత ఓటర్లను టార్గెట్ గా చేసుకుని చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపు ఇందుకు నిదర్శనం. ఇది కూడా ఇప్పుడు కేసీఆర్ మునిసిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు సందేహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఒకప్పుడు ఎన్నికలంటే ఎంతో హుషారుగా ఉండే కేసీఆర్‌లో ఇప్పుడు ఆ జోష్ తగ్గిదనే చెప్పాలి.