Begin typing your search above and press return to search.
వైసీపీలోకి కత్తి పద్మారావు.. గుంటూరులో సీటు?
By: Tupaki Desk | 14 Nov 2020 12:45 PM ISTదళిత ఉద్యమ కారుడు.. ప్రజాకవి.. మేధావి.. కత్తి పద్మారావు వైసీపీలోకి చేరుతున్నారా? ఇప్పటికే ఆయనతో జగన్ ఫోన్‌లో చర్చించారా? అంటే.. వైసీపీ సీనియర్లు ఔననే అంటున్నారు. దీనికి రెండు కారణాలు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ సర్కారుపై ఎస్సీ సామాజిక వర్గం ఆగ్రహంతో ఉంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో జగన్ మౌనంగా ఉండడం... ఇది తన చేతుల్లో లేదని చెప్పడం మాదిగ సామాజిక వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది. అదేసమయంలో ప్రభుత్వంలో ఎస్సీలకు ప్రాధాన్యం ఇచ్చినా.. వారిని కేవలం అచేతనంగా ఉంచడం.. ప్రాధాన్యం లేకుండా చేయడంపైనా.. ఎస్సీ సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఇవన్నీ ఇలా ఉంటే.. జగన్ సర్కారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలకు రక్షణ కొరవడిందనే భావనను ఆవర్గానికి చెందిన న్యాయవాదులు జడ శ్రావణ్‌కుమార్, మాజీ జడ్జి రామకృష్ణ వంటి వారు.. బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇక, క్షేత్రస్థాయిలోనూ పరిస్థితి దీనికి భిన్నంగా లేకపోవడంతో ఎస్సీ వర్గాల్లో ఆందోళన పెరిగిందనేది వాస్తవం. మరోవైపు.. టీడీపీ ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం పెంచుతూ.. కీలకమైన పార్టీ పొలిట్ బ్యూరో.. సహా పార్లమెంటరీ జిల్లా ఇంచార్జ్‌ల పదవులను కూడా వారికి కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో అటు బీసీ, ఇటు ఎస్సీలను తనవైపు తిప్పుకొనేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.
వీటిని నిశితంగా గమనిస్తున్న జగన్ ఆయన పార్టీ సీనియర్లు కూడా ఎస్సీ వర్గాలను తమవైపు మళ్లించుకు నేందుకు బలమైన నాయకుడిని పార్టీలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే రాజకీయంగా సంబంధాలు ఉన్న ఇటు మేధావి వర్గంలోను, అటు ఎస్సీ సామాజిక వర్గాల్లోనూ `దళిత గాంధీ`గా పేరున్న కత్తిపద్మారావును పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. కారణాలు ఏవైనా.. కత్తి పద్మారావు కూడా జగన్ సర్కారు విషయంలో సానుకూలంగా ఉండడం.. జగన్ విషయంలో పాజిటివ్ దృక్ఫథంతోపాటు.. చంద్రబాబును విభేదిస్తుండడం వైసీపీకి కలిసి వస్తోంది.
అంతేకాదు.. అత్యంత కీలకమైన రాజధాని విషయంలో.. కేవలం అమరావతి ఏర్పాటుతో అధికార, ఆర్థిక కేంద్రీకరణలుజరుగుతాయని.. రాజకీయ వికేంద్రకరణ జరగాలన్నా.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నా.. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం మంచిదేనని కత్తి పద్మారావు కొన్ని ఇంటర్వ్యూల్లోనూ చెప్పిన నేపథ్యంలో కత్తి పద్మారావు వంటివారిని పార్టీలోకి తీసుకోవడం మంచిదని జగన్ భావిస్తున్నారు. ఈయనకు గుంటూరు జిల్లాలోని ఓ ఎస్సీ నియోజకవర్గాన్ని కూడా కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి కత్తి పద్మారావు.. త్వరలోనే జగన్ గూటికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం కత్తికి ఏర్పడిన రాజకీయ శూన్యత కూడా దీనికి బలాన్ని చేకూరుస్తుండడం గమనార్హం.