Begin typing your search above and press return to search.

సీబీఐ కస్టడీకి కడప ఎంపీ సన్నిహితుడా?

By:  Tupaki Desk   |   26 Nov 2021 9:30 AM GMT
సీబీఐ కస్టడీకి కడప ఎంపీ సన్నిహితుడా?
X
వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అధికార వైసీపికి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య కేసులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరును నిందితుడు దస్తగిరి చెప్పిన సంగతి తెలిసిందే. శివశంకర్ రెడ్డితోపాటు వైఎస్ కుటుంబ సభ్యుల పేర్లను కూడా దస్తగిరి ప్రస్తావించినా సంగతి తెలిసిందే.

వివేకా కూతురు డాక్టర్ సునీత కూడా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో దేవిరెడ్డి పేరుంది. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసులో అరెస్ట్ అయ్యి కడప కేంద్ర కారాగారంలో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల కోర్టులో సీబీఐ పిటీషన్ దాఖలు చేసింది. 7 రోజుల కస్టడీకి అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 2వ తేదీ వరకూ శివశంకర్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించనుంది.

ఈ హత్య చేస్తే శంకర్ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తానన్నాడని.. రూ.5 కోట్లు నీకు ఇస్తానని వివేకాకు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరి నేర అంగీకార వాంగ్మూలంలో వెల్లడించడం సంచలనమైంది.

ఇప్పటికే తన తండ్రి వివేకా హత్యపై డాక్టర్ సుజాత కొన్ని ఆధారాలను సమర్పించింది.అందులో శివశంకర్ రెడ్డి పాత్రపై విచారించాలని కోరింది. మరి నిందితుడు దస్తగిరి, డాక్టర్ సునీతలు అనుమానించిన దేవి రెడ్డి నుంచి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయన్నది వేచిచూడాలి.