Begin typing your search above and press return to search.
జనసేన ఎగ్జిట్: తొలిసారి స్పందించిన జేడీ
By: Tupaki Desk | 3 Feb 2020 10:55 AM ISTపవన్ కళ్యాణ్ పాలిటిక్సే వేరు.. ఆయన ఏపీ రాజకీయాల్లో రావడమూ.. పార్టీ పెట్టడం.. పోరాడడమూ.. తిట్టిన వారితోనే కలవడం.. సినిమాలు వదిలేశాననిమళ్లీ మొదలుపెట్టడం.. ఇలా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నట్టు నిలకడలేని రాజకీయం జనసేన ఆవిర్భావం నుంచి కనిపించింది. మళ్లీ సినిమాల బాట పట్టిన పవన్ వైఖరిపై విసుగు చెందిన జేడీ లక్ష్మీనారాయణ వైదొలిగారు.
అయితే ఆయన చెప్పిన కారణంపై చాలా చర్చ జరిగింది. పవన్ సినిమాలు తీయడాన్ని తప్పు పట్టిన జేడీనే అందరూ తప్పు పట్టారు. టీడీపీ, జయప్రకాశ్ నారాయణ, కొందరు నేతలు సైతం జేడీ లక్ష్మీనారాయణదే తప్పు అన్నారు.
అయితే తాజాగా ఓ కార్యక్రమం లో పాల్గొన్న జేడీ లక్ష్మీనారాయణ తాను ఎందుకు జనసేన వీడానో పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.పవన్ కళ్యాన్ పార్ట్ టైం పాలిటిక్స్ తో జనసేన లో ఉంటే ప్రజా సేవ చేయలేమని అందుకే బయటకు వచ్చానని తెలిపారు. ఇక నుంచి ప్రజాసేవ చేస్తూనే ఉంటానని.. ప్రజాసేవ కు అత్యుత్తమ వేదిక రాజకీయమేనన్నారు.
రాజకీయాలను మార్చుదామని అత్యున్నత పోలీస్ జాయింట్ డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేసి వచ్చిన జేడీకి జనసేనలో అది కనిపించలేదని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.. అందుకే వైదొలిగారు. తాజాగా కేంద్ర బడ్జెట్ బాగుందని బీజేపీ ని పొగిడేశారు. బహుశా ఆయన అడుగులు బీజేపీ వైపు పడవచ్చన్న చర్చ సాగుతోంది. పవన్ పార్ట్ టైం పాలిటిక్స్, జేడీ విస్తృత పాలిటిక్స్ కు పడకనే వీరిద్దరూ విడిపోయినట్టు అర్థమవుతోంది.