Begin typing your search above and press return to search.

వల్లభనేని వంశీ వల్ల జగన్ కు చెడ్డపేరు వస్తోందా?

By:  Tupaki Desk   |   5 Sept 2020 1:40 PM IST
వల్లభనేని వంశీ వల్ల జగన్ కు చెడ్డపేరు వస్తోందా?
X
ఏపీ సీఎం జగన్ ప్రతీ విషయంలో ఒక క్లారిటీతో ముందుకెళ్తుంటారు. ఎవరైనా పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని క్లియర్ గా చెప్పేశారు. వలస విషయంలో ప్రజల్లో అభాసుపాలుకాకుండా.. చంద్రబాబులా సంతలో పశువుల్లాగా లాగేయకుండా విశ్వసనీయతతో ముందుకెళ్తారనే పేరు తెచ్చుకున్నారు.

అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నియోజకవర్గం అభివృద్ధి కోసం నేను వెళ్తానని వైసీపీ బాటపట్టారు. చంద్రబాబు, లోకేష్ ను తిట్టి వైసీపీతో సంసారం చేస్తున్నాడు. గన్నవరం లో లేని సమస్యలు తెస్తూ వైసీపీని ఇబ్బంది పెడుతున్నాడనే చర్చ సాగుతోంది. లోకల్ గా వైసీపీ వాళ్లను అణగదొక్కుతున్నాడని పెద్ద ఎత్తున నిరసనలు , ఫిర్యాదు చేస్తున్నారు.

వైసీపీ రూల్స్ కు వ్యతిరేకంగా జగన్ మాటను పక్కనపెట్టి ఈరోజు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ లో వంశీ పాల్గొనడం కలకలం రేపింది. వైసీపీ రూల్స్ ను తుంగలో తొక్కేశాడనే పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి అతడికి విలువ ఇవ్వకుండా చేయాలని అందరూ సీఎంను వైసీపీ సోషల్ మీడియాలో అడుగుతున్నారు.

డైరెక్ట్ వైసీపీ ప్రెస్ మీట్ లో పాల్గొంటూ జగన్ పరువు తీద్దామనే టీడీపీ ఎమ్మెల్యే వంశీ ఆలోచిస్తున్నాడని.. ఒంటిచేత్తో గెలిచిన జగన్ ను వంశీ అవమానపరుస్తున్నాడని గన్నవరం రియల్ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.