Begin typing your search above and press return to search.

రాహుల్ చేసిన త‌ప్పే జ‌గ‌న్ చేస్తున్నాడా ?

By:  Tupaki Desk   |   9 May 2022 9:30 AM GMT
రాహుల్ చేసిన త‌ప్పే జ‌గ‌న్ చేస్తున్నాడా ?
X
అధికారంలో ఉన్నా లేక‌పోయినా ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండాలి. అధికారం ఉన్నా లేక‌పోయినా ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకోవాలి. ముఖ్యంగా అణ‌గారిన వ‌ర్గాల అభ్యున్న‌తే ధ్యేయం కావాలి. రాజకీయ వార‌స‌త్వం అందుకున్న నాయ‌కులు త‌మ వెనుక‌టి త‌రం చేసిన కొన్ని మంచి ప‌నులను త‌ప్ప‌క అనుస‌రించి ముందడ‌గులు వేయాలి. ఆ విధంగా ప‌రిప‌క్వ‌త‌ను సాధించ‌గ‌లిగితే మంచి ఫ‌లితాలు ఎప్ప‌టిక‌ప్పుడు పొంద‌వ‌చ్చు. ఓ నాయ‌కుడు గెల‌వ‌డం అంటే కేవ‌లం ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం అనే కాదు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించే దిశ‌గా న‌డ‌వ‌డం.. ప‌రుగులు తీయడం..తీయండి అని త‌న తోటివారికి చెప్ప‌డం..ఈ విధంగా ఎన్నో ! మ‌రి! రాహుల్ కానీ జ‌గ‌న్ కానీ చేస్తున్న త‌ప్పిదాలు ఏంటి ? ఇద్ద‌రికీ ఓ సారూప్య‌త ఉంది క‌నుక‌నే ఈ క‌థ‌నం.

రాజ‌కీయాల్లోకి రాహుల్ వ‌చ్చి ఏళ్లు గడుస్తున్నా ఆయ‌న‌కు ప‌రిణితి రాలేదు అన్న‌ది ఓ విమ‌ర్శ. కాంగ్రెస్ పార్టీ త‌ర‌హా రాజ‌కీయాలు ఆయ‌న‌కు ఇంకా రావ‌డం లేదు. అందుకే ఆయ‌న త‌రుచూ త‌డ‌బ‌డుతున్నారు. ఎన్నిక‌ల వేళ మాత్రం మాట్లాడి త‌రువాత కాలంలో ఆయ‌న ఇంటికే ప‌రిమితం అయిన దాఖ‌లాలు గ‌తంలో ఎన్నో ఉన్నాయి. ఆయ‌న క్రియాశీల‌కం కాలేక‌పోతున్నారు స‌రి క‌దా తోటివారిని కూడా ఆ విధంగా స‌మాయ‌త్తం చేయ‌డంలో కూడా విఫ‌లం అవుతున్నారు. ఒక‌వేళ ఆయ‌న ప‌నిచేసినా కూడా మిగ‌తా వారు స్పందించిన దాఖ‌లాలే లేవు. అంటే అధికారం ఉంటే అనుభ‌విస్తాం అనుకునే నాయ‌కుల

ద‌గ్గ‌ర రాహుల్ ప‌నిచేస్తున్నాడు. ఆ విధంగా కొన్ని నిర్ణ‌యాల అమ‌లులో క‌ఠినాత్మ‌క వైఖ‌రికి క‌ట్టుబ‌డి ఉన్నా ఫ‌లితాలు రావ‌డం లేదు. ముఖ్యంగా ద‌ళితులు., మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక. వాళ్ల‌కు చేరువ‌గా ఇవాళ కాంగ్రెస్ లేదు. ద‌ళితుల‌కు సంబంధించి జ‌రుగుతున్న హ‌త్యా కాండ‌లు, ప‌రువు హ‌త్య‌ల‌పై పెద్ద‌గా మాట్లాడిన దాఖ‌లాలు రాహుల్ టైం ఫైల్స్ లో లేవు.

నిన్న‌మొన్న‌టి స‌రూర్ న‌గ‌ర్ ఘ‌ట‌న‌పై కూడా మాట్లాడ‌కుండానే వెళ్లారు. ప‌రువు హ‌త్య‌కు సంబంధించి క‌నీసం ఓ మాట కూడా మాట్లాడ‌లేక‌పోయారు. మ‌నుషులంటే రైతులే కాదు ద‌ళితులు కూడా ! మ‌నుషులంటే రైతులే కాదు బాధిత మ‌హిళ‌లు కూడా !

ఇదే విధంగా జ‌గ‌న్ కూడా కొన్ని త‌ప్పిదాలు చేస్తున్నారు. ద‌ళితుల విష‌య‌మై వారికి జ‌రుగుతున్న అన్యాయాల‌పై త‌క్ష‌ణ స్పంద‌న అన్న‌ది ఇవ్వ‌లేక‌పోతున్నారు. రెండు ప‌ర్యాయాలు ద‌ళిత మ‌హిళ‌ల‌కే హోం మంత్రి ప‌ద‌వి ఇచ్చినా కూడా ఫ‌లితం లేదు. ముఖ్యంగా స్థానిక నాయ‌క‌త్వాల అరాచకాల‌కు చ‌ర‌మ‌గీతం పాడ‌లేక‌పోతున్నార‌న్న విమ‌ర్శ‌ల‌ను విప‌క్షం నుంచి అందుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో నిన్న‌టి వేళ సోష‌ల్ మీడియా వేదిక‌గా లోకేశ్ ఏమ‌న్నారో చూద్దాం...

వైసిపి నేతల అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. కూల్చడమే తప్ప నిర్మించడం తెలియని వైసిపి నాయకులు మరో దళిత కుటుంబం పై దమనకాండకు పాల్పడ్డారు. టిడిపి సానుభూతి పరులు అనే ఒకే ఒక్క కారణంతో అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవల్లిలో హనుమంత రాయుడు, అనంతలక్ష్మి దళిత దంపతుల ఇంటిని అధికారులపై ఒత్తిడి చేసి అన్యాయంగా కూల్చేశాడు స్థానిక వైసిపి నేత. జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక ఆ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరం. కక్షతో దళితులకు చెందిన ఇంటిని కూల్చిన వైసిపి నాయకుడిపై చర్యలు తీసుకోవాలి. హనుమంత రాయుడు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చెయ్యాలి.