Begin typing your search above and press return to search.

ఔనన్నా కాదన్నా చిరునే పెద్ద దిక్కు : మంత్రి

By:  Tupaki Desk   |   29 April 2022 12:30 PM GMT
ఔనన్నా కాదన్నా చిరునే పెద్ద దిక్కు : మంత్రి
X
తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్క మెగాస్టార్ చిరంజీవి అంటూ తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ వ్యాఖ్యలు చేశారు. ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ మెంబర్స్ కి హెల్త్ కార్డులను పంపిణీ చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ చిరు పై ప్రశంసలు కురిపించారు.

తెలంగాణ మరియు ఏపీ లో తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి వాటి పరిష్కారం కోసం తనవంతు సహకారం అందించాడు. తన స్థాయిని పక్కన పెట్టి కూడా అవసరం ఉన్నా లేకున్నా ఇండస్ట్రీ కోసం అన్నట్లుగా తిరిగిన చోటుకు మళ్లీ మళ్లీ తిరిగి సినిమా పరిశ్రమకు సంబంధించి సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఇబ్బందుల పరిష్కారం చూపించాడు.

అలాంటి చిరంజీవిని ఇండస్ట్రీ పెద్ద అంటూ అంతా కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. అయితే చిరంజీవి మాత్రం ఇండస్ట్రీ కి ఏం కావాలన్నా నేను ముందు ఉంటాను. ఇండస్ట్రీ కోసం ఎంత దూరం అయినా వస్తాను. కాని ఇండస్ట్రీ పెద్ద.. పెద్దన్నా.. పెద్ద దిక్క అనే బిరుదులు బాధ్యతలను మాత్రం మోయాలని భావించడం లేదు అంటూ చిరంజీవి ఆ మద్య ఒక కార్యక్రమంలో క్లారిటీ గా చెప్పేశాడు.

చిరంజీవి పలు సార్లు పెద్ద దిక్కు గౌరవంను తిరష్కరించినా కూడా ఆయన్ను ఇండస్ట్రీకి చెందిన వారు మరియు బయటి వారు అంతా కూడా ఆయన్ను ఇండస్ట్రీ పెద్ద అన్నట్లుగానే భావిస్తూ ఉన్నారు. ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఆయన తర్వాతే మరెవ్వరైనా అన్నట్లుగా సినీ ప్రేమికులు మరియు మీడియా వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మంత్రి తలసాని కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ కోసం ఎంతో పోరాటం చేస్తున్న చిరంజీవి గారే ఇండస్ట్రీ పెద్ద. ఆయన్ను ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే అన్నట్లుగా తలసాని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ సమయంలో చిరంజీవి స్పందిస్తూ నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను అన్నట్లుగా నవ్వుతూ మరోసారి ఇండస్ట్రీ పెద్ద బిరుదును తిరష్కరించినట్లుగా చిరు స్పందించాడు.