Begin typing your search above and press return to search.

అసలుసిసలు కార్పొరేట్ వార్ షురూ? టెలికంలోకి అదానీ రెఢీ

By:  Tupaki Desk   |   9 July 2022 4:10 AM GMT
అసలుసిసలు కార్పొరేట్ వార్ షురూ? టెలికంలోకి అదానీ రెఢీ
X
కార్పొరేట్ వార్ అన్న మాట చాలామంది వినే ఉంటారు. చూసే అవకాశం చాలా తక్కువ సందర్భాల్లోనే కనిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి సీన్ ఒకటి తెర మీదకు రానుంది. దేశీయ టెలికం రంగంలోకి భారీ దిగ్గజం ఒకటి ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో దేశంలోని రెండు ప్రముఖ సంస్థల మధ్య కార్పొరేట్ యుద్ధం షఉరూ కానుందని చెప్పాలి.

5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనడటం ద్వారా టెలింకంలోకి ఎంట్రీ ఇవ్వాలని పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్ భావిస్తున్న వైనం బయటకు వచ్చింది తాజాగా స్పెక్ట్రం వేలానికి గౌతమ్ అదానీ అప్లై చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో దేశీయంగా దిగ్గజ వ్యాపారులైన ఇద్దరు కుబేరుల మధ్య కార్పొరేట్ వార్ కు తెర లేచినట్లేనన్న మాట వినిపిస్తోంది.

స్పెక్ట్రం వేలం శుక్రవారంతో ముగిసింది. మొత్తం నాలుగు సంస్థలు దరఖాస్తు చేసుకోగా.. అందులో ముగ్గురు పాతకాపులే. ముకేశ్ అంబానీకి చెందిన జియో.. సునీల్ మిట్టల్ కు చెందిన ఎయిర్ టెల్.. వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూపు సంస్థ కూడా దరఖాస్తు చేసుకోవటం ఆసక్తికరంగా మారింది.

అయితే..అప్లికేషన్ పెట్టుకున్న వారి పేర్లను అధికారికంగా మాత్రం ఈ నెల 12న ప్రకటించనున్నారు. అదానీ గ్రూపు ఈ మధ్యనే నేషనల్ లాంగ్ డిస్టెన్స్.. ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ లైసెన్సులను తీసుకుంది.

ఇక.. స్పెక్ట్రం వేలం విషయానికి వస్తే.. వివిధ బ్యాండ్లలో దాదాపు రూ.4.3 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రం వేలం ఈ నెల 26న జరగనుంది. దేశీయంగా వ్యాపార దిగ్గజాలైన అంబానీ.. అదానీలు భారీ వ్యాపార సామ్రాజ్యాల్ని స్థాపించినా.. ఈ ఇద్దరు గుజారాత్ వ్యాపారులు ముఖాముఖిన ఒకే వ్యాపారంలో ఢీ కొన్న పరిస్థితి ఇప్పటివరకు లేదు. ఒకే రంగంలో వీరిద్దరూ పోటీ పడే అరుదైన ఘటన ఇప్పుడు చోటు చేసుకోనుంది.

అంబానీ విషయానికి వస్తే ఆయిల్..పెట్రో కెమికల్స్.. టెలికం.. రిటైల్ లో విస్తరిస్తే.. అదానీ మాత్రం పోర్టులు.. బొగ్గు.. ఏవియేషన్ లాంటి రంగాలపై ఫోకస్ చేశారు. పునరుత్పాక విద్యుత్ విభాగంలో అంబానీ.. అదానీ ఇద్దరు పోటాపోటీగా పెట్టుబడులు ప్రకటిస్తున్న వేళ.. తాజాగా వీరిద్దరూ టెలికం రంగంలో ఢీ అంటే ఢీ అనేలా స్పెక్ట్రం కోసం అప్లికేషన్లు పెట్టటంతో దేశీయంగా కార్పొరేట్ వార్ అన్నది చూసే అవకాశం కలగనుందని చెప్పక తప్పదు.