Begin typing your search above and press return to search.

ఇలా కూడా స్కామ్ చేయొచ్చా..?

By:  Tupaki Desk   |   16 April 2021 6:00 AM IST
ఇలా కూడా స్కామ్ చేయొచ్చా..?
X
త్త కొత ప‌ద్ధ‌తుల ద్వారా దోపిడీల‌కు పాల్ప‌డుతూ హ‌డ‌లెత్తిస్తున్నారు సైబ‌ర్ నేర‌గాళ్లు. తాజాగా ఓ సైబ‌ర్ నేరస్థుడు.. ఏకంగా ల‌క్ష రూపాయ‌లు లూటీ చేశాడు. దానికోసం వేసిన ఎత్తుగ‌డ చూస్తే నోరెళ్లబెట్ట‌డం ఖాయం. ఇలా కూడా దోపిడీ చేస్తారా? అనే సందేహం క‌ల‌గ‌క మాన‌దు.

హైద‌రాబాద్ కు చెందిన సుశీల్ అనే వ్య‌క్తి.. త‌న ఇంట్లోని సోఫాను OLXలో అమ్మ‌కానికి పెట్టాడు. ఇది చూసిన ఓ వ్య‌క్తి ఫోన్ చేసి, తాను కొనుగోలు చేస్తాన‌ని చెప్పాడు. రూ.6,500ల‌కు బేరం కుదిరింది. ఈ మొత్తాన్ని గూగుల్ పే ద్వారా చెల్లిస్తాన‌ని చెప్పాడు స‌ద‌రు వ్య‌క్తి. గూగుల్ పే క్యూఆర్ కోడ్ సెండ్ చేసి, దాన్ని స్కాన్ చేయండి అమౌంట్ మీ ఖాతాలో జ‌మ‌వుతుంద‌ని చెప్పాడు.

దీంతో.. సుశీల్ అత‌ను చెప్పిన‌ట్టుగానే స్కాన్ చేశాడు. కానీ.. సుశీల్ కు డ‌బ్బులు రాక‌పోగా.. అత‌ని అకౌంట్లోంచే రూ.6,500 క‌ట్ అయ్యాయి. ఇదేంటి ఇలా జ‌రిగింద‌ని స‌ద‌రు వ్య‌క్తికి ఫోన్ చేసి అడ‌గ్గా.. ఏదో తేడా జ‌రిగింద‌ని చెప్పాడు. ఇప్పుడు మ‌రొక కోడ్ పంపిస్తున్నాన‌ని, దాన్ని స్కాన్ చేయాల‌ని, మొత్తం 13 వేలు మీ అకౌంట్లోకి వ‌స్తాయ‌ని చెప్పాడు.

నిజ‌మేన‌ని న‌మ్మిన సుశీల్‌.. మ‌ళ్లీ స్కాన్ చేశాడు. దీంతో.. ఇత‌ని అకౌంట్లోనుంచే రూ.13 వేలు క‌ట్ అయ్యాయి. మ‌ళ్లీ అలాగే జ‌రిగింద‌ని చెప్పాగా.. ఇంకోసారి కోడ్ పంపించాడు. ఇలా మొత్తం ఎనిమిది సార్లు క్యూఆర్ కోడ్ పంపించి, మొత్తం 1.96 ల‌క్ష‌లు దోచుకున్నాడు సైబ‌ర్ నేర‌గాడు.

తొమ్మిదోసారి కూడా మ‌ళ్లీ కోడ్ పంపించి, ఈసారి స్కాన్ చేయండి, మొత్తం వెన‌క్కి వ‌చ్చేస్తాయ‌ని చెప్ప‌డాట‌. అప్ప‌టికిగానీ.. తాను మోస‌పోతున్నాన‌నే విష‌యం గుర్తించ‌లేక‌పోయాడు సుశీల్‌. ఆ త‌ర్వాత‌ వెళ్లి పోలీసుల‌కు విష‌యం చెప్పాడు.