Begin typing your search above and press return to search.
ప్రత్యర్ధులపై దాడులకే పరిమితమా ?
By: Tupaki Desk | 12 Jun 2021 11:00 PM ISTసీబీఐ, ఈడీ, ఐటీ...ఇవన్నీ కేంద్రప్రభుత్వ పరిధిలోని సంస్ధలు. అక్రమార్కులు, అవినీతిపరులపై దాడులు చేసి వాళ్ళ నిజస్వరూపమేంటో తేలుస్తాయని మామూలు జనాలు అనుకుంటారు. కానీ వాస్తవంగా జరుగుతున్నది మాత్రం వేరు. ఇదంతా ఎందుకంటే టీఆర్ఎస్ ఎంపి నామా నాగేశ్వరరావు ఇల్లు, ఆఫీసులపై ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. పై సంస్ధలన్నీ దాడులు చేస్తున్నాయి కానీ తర్వాత ఫాలోఅప్ మాత్రం ఉండటంలేదు.
ఎవరిపైనైనా పై సంస్ధల ఉన్నతాధికారులు దాడులు చేయగానే మీడియాలో తాటికాయంత అక్షరాలతో కవరేజి వస్తోంది. కానీ తర్వాత ఫాలోఅప్ ఏమి జరుగుతోందనే విషయంలో మాత్రం ఏమీ అర్ధం కావటంలేదు. పైగా దర్యాప్తు సంస్దలను కేంద్రప్రభుత్వం తన ప్రత్యర్ధి పార్టీలపై ప్రయోగిస్తోందనే ఆరోపణలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
టీఆర్ఎస్ ఎంపి నామాపై దాడులు చేయటం వరకు ఓకేనే కానీ తర్వాత యక్షన్ ఏమిటో మాత్రం తెలీటంలేదు. ఎందుకంటే 2019లోనే నామాపై సీబీఐ దాడులు చేసింది. రు. 1100 కోట్ల ప్రజాధనాన్ని బ్యాంకునుండి తీసుకున్నారని అందులో రు. 260 కోట్ల దారి మళ్ళించారనే ఆరోపణలున్నాయి. దారిమళ్ళించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయంటు చార్జిషీటు కూడా దాఖలు చేసింది.
నిధులు దారిమళ్ళించటం నిజమే అయితే ఎందుకని అరెస్టు చేయలేదు ? ఎందుకు శిక్షపడలేదు ? ఇంతకాలానికి మళ్ళీ ఈడీ దాడులు చేయాల్సిన అవసరం ఏమిటి ? గతంలో కూడా సుజనాచౌదరి, సీఎం రమేష్, రఘురామకృష్ణంరాజు లాంటి వారిపై దాడులు జరిగాయి. అప్పుడు కూడా కీలకపత్రాలు స్వాధీనం అనే ప్రచారం జరిగింది. పై ముగ్గురు బ్యాంకులను దోచేసుకున్నట్లు సీబీఐ తన దర్యాప్తులో నిర్ధారణయ్యిందన్నారు. మరి తర్వాత ఫాలోఅప్ ఏమైంది ?
పశ్చిమబెంగాల్లో కూడా తృణమూల్ మంత్రులు, ఎంఎల్ఏలపై నారదా స్కాంలో నిందులంటు సీబీఐ దాడులు చేసి అరెస్టుచేసింది. ఇవే ఆరోపణలున్న బీజేపీ ఎంఎల్ఏలపైన మాత్రం దాడులు లేవు, అరెస్టులు లేవు. అంటే గతంలోనే సుప్రింకోర్టు వ్యాఖ్యానించినట్లు సీబీఐ అనేది పంజరంలో చిలకైపోవటం నిజమేనా ? అనే డౌటొస్తోంది. ఎవరిపైనైనా దాడులు చేసినపుడు, అవినీతి, అక్రమాలకు పాల్పడింది నిజమే అని నిర్ధారణ అయితే వాళ్ళపై కచ్చితంగా యాక్షన్ ఉండకపోతే జనాల్లో విశ్వాసం కోల్పోవటం ఖాయం.