Begin typing your search above and press return to search.

బీజేపీ నేతలను పట్టుకోవటం కష్టమేనా ?

By:  Tupaki Desk   |   7 Dec 2020 8:00 AM IST
బీజేపీ నేతలను పట్టుకోవటం కష్టమేనా ?
X
కమలం పార్టీ నేతలను పట్టుకోవటం కష్టమేనా ? క్షేత్రస్ధాయిలో పరిస్దితులను చూస్తే అలాగే అనిపిస్తోంది. ఎక్కడో తెలంగాణాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో గెలిస్తేనే ఏపి బీజేపీ నేతలు రెచ్చిపోయారు. అలాంటిది తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో ఏకంగా 4 డివిజన్ల నుండి 48 డివిజన్లకు పెరిగిపోయిన తర్వాత ఇక కమలనాదులు ఆగుతారా ? దుబ్బాకలో గెలిచినందుకు, గ్రేటర్ ఎన్నికల్లో గెలిచినందుకు తెలంగాణా బీజేపీ నేతలు రెచ్చిపోయారంటే అర్ధముంది. కానీ తెలంగాణా ఎన్నికల్లో గెలుపుతో ఏపిలో కూడా రెచ్చిపోతున్నారంటే ఏమిటర్ధం ?

ఏమిటంటే మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారనే అర్ధం. అవును జస్ట్ మైండ్ గేమ్ ఆడుతున్నారు బీజేపీ నేతలు. తెలంగాణాలో రాజకీయ పరిస్దితులు ఏపిలో రాజకీయ పరిస్దితులు ఒకేలాగ ఉండవని అందరికీ తెలిసిందే. తనకు ప్రత్యర్ధే ఉండకూడదన్న ఉద్దేశ్యంతో తెలంగాణాలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను కేసీయార్ దుంపనాశనం చేసేశారు. కాబట్టి వాటి స్ధానంలో బీజేపీ లేచి కూర్చింది. ఇదే సమయంలో టీడీపీ, కాంగ్రెస్ మీద జనాలకు నమ్మకాలు పోవటంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగటానికి అవకాశం దొరికింది.

ఏపి పరిస్దితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేకుండానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జనాలే ఘోరీ కట్టేశారు. ఇక చంద్రబాబునాయుడు స్వయంకృతం వల్లే టీడీపీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వామపక్షాలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. జనసేన పరిస్దితి ఏమిటో అధినేత పవన్ కల్యాణ్ కే తెలీదు. ఇక బీజేపీ ఒక్కటే రెచ్చిపోతోంది. నిజానికి రాష్ట్రంలో బీజేపీకి సంస్ధాగతంగా ఏమాత్రం బలంలేదు. అందుకే తెలంగాణాలో గెలుపును చూసుకుని ఏపిలో రెచ్చిపోతున్నారు.

నిజానికి ఏపితో పోల్చుకుంటే తెలంగాణాలోనే బీజేపీ మొదటినుండి అంతో ఇంతో బలంగా ఉంది. అలాంటి బీజేపీ నేతలు కూడా జగన్ను అధికారం విషయంలో చాలెంజ్ చేసేస్తున్నారు. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెచ్చిపోతున్నారు. ప్రతిపక్షాల్లోనే కాకుండా ఆరేళ్ళ పాలనలో కేసీయార్ పై జనాల్లోనే కాకుండా పెరిగిపోతోంది. కానీ ఏపిలో జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరే అయ్యింది. ఆ విషయాన్ని మరచిపోయి బీజేపీ నేతలు ఒకవైపు చంద్రబాబును మరోవైపు జగన్ను ఏకకాలంలో చాలెంజి చేస్తున్నారు. వీళ్ళ వరస చూస్తుంటే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరిగేంత వరకు బీజేపీ నేతలను పట్టుకోవటం కష్టమే.