Begin typing your search above and press return to search.

హెచ్.సీ.ఏలో అజార్ కు సీన్ రివర్స్

By:  Tupaki Desk   |   30 March 2021 1:30 PM GMT
హెచ్.సీ.ఏలో అజార్ కు సీన్ రివర్స్
X
ఎన్నో ఆశలతో అవినీతి మయమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను ప్రక్షాళన చేస్తాడని అధ్యక్షుడిగా ఎన్నికైన అజారుద్దీన్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే నాడు జై కొట్టిన వారే నేడు అజార్ నాయకత్వ వైఫల్యం చూసి వద్దంటున్నారు. తాజాగా అజార్ పై విమర్శల వాన కురిపిస్తున్నారు.

టీం ఇండియా మాజీ కెప్టెన్.. హైదరాబాద్ క్రికెటర్ అజారుద్దీన్ ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రావాలని క్రికెట్ సంఘాలన్నీ అప్పట్లో కోరాయి. సిటీలోని క్రికెట్ క్లబ్బులన్నీ ఏకమైనా అజారుద్దీన్ ను హెచ్.సీ.ఏ ప్రెసిడెంట్ గా గెలిపించాయి. ఆ తర్వాత పెనుమార్పులు వస్తాయని అంతా భావించారు.కానీ ప్రస్తుతం ఇంకా దిగజారిపోయేలా హెచ్.సీ.ఏ వ్యవహారాలు కనిపిస్తున్నాయి. హెచ్.సీ.ఏ చరిత్ర మసకబారిపోయేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన సొంత ప్యానెల్ నుంచే తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

హెచ్.సీ.ఏ సెక్రటరీగా ఉన్న విజయానంద్ కు.. అధ్యక్షుడు అజారుద్దీన్ కు మధ్య వైరం తారాస్థాయికి చేరిందని ప్రచారం సాగుతోంది. అజారుద్దీన్ తోనే గెలిచిన విజయానంద్ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు. హెచ్.సీ.ఏ సమావేశంలో ఇద్దరూ వేదికపైనే వాగ్వాదానికి దిగారు. అందరూ అజార్ పై విరుచుపడ్డారు.

హెచ్.సీ.ఏ అభివృద్ధికి ఏం చేశాడో అజారుద్దీన్ చెప్పాలని అన్ని తెలంగాణ జిల్లాల అధ్యక్షులు నిలదీయడంతో సమావేశం రసాభాసగా ముగిసింది. ఆయనను అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని అందరూ డిమాండ్ చేశారు. అజార్ కు మద్దతుగా ఒక్కరూ మాట్లాడలేదు. దీంతో ఏదో చేస్తాడని ఆశించిన అజారుద్దీన్ ఏమీ చేయలేక పరిస్థితి ఇంకా దిగజార్చాడని చెప్పొచ్చు.