Begin typing your search above and press return to search.
పవన్, రజినీకాంత్ సినిమాలు చేసుకోవడమే బెటర్?
By: Tupaki Desk | 28 Dec 2020 4:00 PM ISTరాజకీయాలు అందరికీ అచ్చిరావు.. కొందరే సక్సెస్ అవుతారు. మిగతా వారంతా ఫ్లాప్ అవుతారు. ఓ ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి వారు సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ రాణించారు. అయితే తెలుగు నాట ఎన్టీఆర్ తర్వాత ఆస్థాయి నటుడు మళ్లీ రాజకీయాల్లో రాణించింది లేదు. ఈ క్రమంలోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఫ్లాప్ అయ్యి వెనక్కి వెళ్లిపోయారు. ఇప్పుడు పవన్ పరిస్థితి అంతంతే.. దీనిపై తాజాగా సీపీఐ జాతీయ నేత నారాయణ హాట్ కామెంట్స్ చేశారు.
దేశంలో సినిమాల నుంచి వచ్చిన వారిలో ఎన్టీఆర్, ఎంజీఆర్ మాత్రమే సక్సెస్ అయ్యారని సీపీఐ నేత నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు దేశంలో అలాంటి పరిస్థితులు లేవని చెప్పుకొచ్చారు.
ఇది గ్రహించి పవన్, రజినీకాంత్ రాజకీయాలపై కాకుండా కళారంగంపై దృష్టి పెట్టడం మంచిదని సూచించారు.
మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పేవన్నీ అబద్ధాలేనని.. ఆయన ప్రజాస్వామ్యవాదిగా చెప్పుకుంటున్నారని నారాయణ విమర్శలు గుప్పించారు.