Begin typing your search above and press return to search.

హైటెక్ యుద్ధానికి భారత్ రెడీ అవుతోందా ?

By:  Tupaki Desk   |   6 Aug 2022 10:30 AM GMT
హైటెక్ యుద్ధానికి  భారత్ రెడీ అవుతోందా ?
X
సంప్రదాయంగా బలమైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాల స్థానంలో హైటెక్ బలాన్ని, సాంకేతికతను పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇప్పటికే ఇలాంటి సాంకేతికత మనకుంది. అయితే ఉన్న హైటెక్ టెక్నాలజీని మరింతగా అప్ గ్రేడ్ చేసుకునేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ముందు ముందు యుద్ధమంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల పాత్ర నామమాత్రమైపోతుందని కేంద్రం భావిస్తోంది. తాజాగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఈ విషయం బయటపడింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒకవైపు ఆర్మీ, నేవీ దళాలు పోరాటాలు చేస్తున్నా మరోవైపు సాంకేతికత ఆధారంగా ఒక దేశం మరో దేశం పై దాడులు చేసుకుంటున్న తీరు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. అఫ్ కోర్స్ ఉక్రెయిన్ వెనకాల అమెరికా లాంటి అగ్ర రాజ్యాలున్నాయి.

అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల సాయంతో రష్యాపై ఉక్రెయిన్ సాంకేతిక యుద్ధం కూడా చేస్తోంది. శాటిలైట్ నుంచి అందుతున్న సూచనలు, సంకేతాల ఆధారంగా రష్యా-ఉక్రెయిన్ దేశాలు ఒకదానిపై మరొకటి దాడులు చేసుకుంటున్నాయి.

రెండు దేశాల్లోని ఆర్ధిక, వ్యాపార, పరిశ్రమలను దెబ్బతీయటానికి పై దేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్నే ఉపయోగించుకుంటున్నాయి. ఆర్ధికంగా దెబ్బతీసేందుకు సైబర్ దాడులు చేసుకుంటున్నాయి. రక్షణ వ్యవస్ధలను దెబ్బ తీసుకునేందుకు ఐటి ఆధారంగా పాస్ వర్డులను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటిద్వారా ప్రత్యర్ధుల రక్షణ వ్యవస్ధల పాస్ వర్డులను తెలుసుకోవటం, పాస్ వర్డులను మార్చేయటం ద్వారా సదరు వ్యవస్థలను జామ్ చేసేయటం లాంటి అనేక పద్దతులను అనుసరిస్తున్నాయి.

ఈ విధానాలను జాగ్రత్తగా గమనిస్తున్న మనదేశం కూడా అలాంటి అత్యుత్తమ వ్యవస్ధలను డెవలప్ చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే మనకు స్కైలైట్ పేరుతో అలాంటి ఆధునిక వ్యవస్ధ ఉంది. అయితే దాన్ని మరింతగా అప్ గ్రేడ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది.

పాకిస్ధాన్, చైనా దేశాలతో ఉన్న సమస్యలనుండి రక్షించుకునేందుకు స్కైలైట్ వ్యవస్ధను అప్ గ్రేడ్ చేసుకుంటోంది. మొత్తానికి యుద్ధంలో ప్రపంచదేశాలు సంప్రదాయపద్దతులకు స్వస్తిపలికి హైటెక్ బాటపడుతున్నాయి.