Begin typing your search above and press return to search.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్లీ ఊపందుకుంటుందా?
By: Tupaki Desk | 29 Nov 2020 6:00 AM ISTకరోనా వైరస్ ప్రపంచాన్ని స్తంభింపచేసింది. అన్నింటిని మూతపడేలా చేసింది. ఈ ఏడాది కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. పరిశ్రమలు బంద్ అయ్యాయి.పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కోల్పోయారు. ఇప్పటికీ రికవరీ కావడం లేదు.
ఈ ఏడాది కరోనాతో కార్యాలయాల లీజింగ్ పై ప్రతికూల ప్రభావం ఏర్పడిందని.. ఇది కొత్త సంవత్సరంలో పుంజుకునే అవకాశముందని స్థిరాస్థి సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
కరోనాకు ముందు మహానగరాల్లో గజం జాగాకు లక్షలు పలికింది. మహానగరం హైదరాబాద్ లో మూడేళ్లుగా కోటికిపైగా చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మాణాల్లో రికార్డ్ సృష్టించింది. అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కు వరుస కట్టడం.. ముందస్తు ఒప్పందాలతో నిర్మాణాలు శరవేగంగా సాగాయి. 2019లో 1.05 కోట్ల చదరపు అడుగుల్లో కొత్త కార్యాలయాలు వచ్చాయి.
అయితే ఈ ఏడాదికి ఆరేళ్ల కనిష్టానికి లీజింగ్ పడిపోయింది. లాక్ డౌన్ తో 55 లక్షల చదరపు అడుగులు మాత్రమే కార్యాలయాలు అద్దెకు తీసుకున్నాయి.
అయితే ప్రపంచంలోని ఫార్చూన్ వెయ్యి కంపెనీలు తమ కార్యాలయాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కరోనా ప్రభావం తగ్గగానే మళ్లీ మార్కెట్ పుంజుకుంటుందని భావిస్తున్నారు.