Begin typing your search above and press return to search.

షాకింగ్ రిపోర్ట్ః హెచ్ఐవీ-కొవిడ్ క‌లిసిపోతున్నాయా?

By:  Tupaki Desk   |   6 Jun 2021 5:30 PM GMT
షాకింగ్ రిపోర్ట్ః హెచ్ఐవీ-కొవిడ్ క‌లిసిపోతున్నాయా?
X
ఇప్పుడంటే పెద్ద‌గా చ‌ర్చ‌లో లేదుగానీ.. ప్ర‌పంచాన్ని వ‌ణికించే వైర‌స్ ల‌లో హెచ్ఐవీది అగ్ర‌స్థాన‌మే. శాశ్వ‌త నివార‌ణ లేని ఈ వైర‌స్ జ‌నాల‌ను ఇప్ప‌టికీ బెంబేలెత్తిస్తూనే ఉంది. అయితే.. తాజాగా వ‌చ్చిన ఓ అధ్య‌య‌న ఫ‌లితం ప్ర‌పంచాన్ని మ‌రింత‌ ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. హెచ్ఐవీ వైర‌స్‌, క‌రోనా సంక్ర‌మ‌ణం చెందే అవ‌కాశం ఉందా అనే భ‌యం తెర‌పైకి వ‌చ్చింది. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఓ కేసు వివ‌రాలు ఇలా ఉన్నాయి.

హెచ్ఐవీతో బాధ‌ప‌డుతున్న 36 సంవ‌త్స‌రాల ఓ మ‌హిళ‌కు గ‌తేడాది క‌రోనా సోకింది. ఈ వైర‌స్ తో ఆమె తొమ్మిది నెల‌లుగా బాధ‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రో షాకింగ్ విష‌యం ఏమంటే.. ఆమె ఒంట్లో చేరిన క‌రోనా వైర‌స్‌ 216 రోజుల్లో మొత్తం 32 సార్లు రూపం మార్చుకుంద‌ట‌! ఈ వేరియంట్ల‌లో బ్రిట‌న్ లో గుర్తించిన ప్ర‌మాద‌క‌ర‌ B.1.1.7 వేరియంట్ కూడా ఉన్న‌ట్టు వైద్యులు తెలిపారు. అంతేకాదు.. E484K మ్యుటేష‌న్ తోపాటు N510Y మ్యుటేష‌న్ వంటివి కూడా ఉండ‌డం మ‌రింత ఆందోళ‌న రేకెత్తిస్తోంది.

ఈ కేసు వివ‌రాల‌ను.. మెడిక‌ల్‌ జ‌ర్న‌ల్ ‘మెడ్రిక్స్ వి’ ప్రచురించింది. 2006 నుంచి ఈ మ‌హిళ హెచ్ఐవీ తో బాధ‌ప‌డుతోంద‌ట‌. రోగ నిరోధ‌క శ‌క్తి చాలా త‌గ్గిపోయిన ఆమె.. గ‌త సెప్టెంబ‌ర్ లో క‌రోనా బారిన ప‌డింది. అప్ప‌టి నుంచి కొవిడ్ రూపాంత‌రం చెందుతూనే ఉంది. ఆమెలోని వైర‌స్ స్పైక్ ప్రొటీన్ 13 ర‌కాలుగా, జ‌న్యుప‌రంగా 19 ర‌కాలుగా మార్పు చెందింద‌ని నిపుణులు పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో హెచ్‌ఐవీ-కొవిడ్ కలిసిపోతాయా అనే ఆందోళ‌న కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. ప్ర‌స్తుతానికి అలాంటిది ఏమీ లేద‌ని ఈ రిపోర్టు చెబుతోంది. కానీ.. ఎయిడ్స్ రోగుల్లో క‌రోనా వైర‌స్ ఎక్కువ కాలం ఉంటోంద‌ని చెబుతున్నారు. వారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణంగా భావిస్తున్నారు. ఈ రెండు కార‌ణాల వ‌ల్ల‌నే వైర‌స్ మ్యుటేష‌న్ పెరుగుతోంద‌ని అంటున్నారు. మ‌రి, మ‌న‌దేశంలో కూడా హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులు చాలా మందే ఉన్నారు. వారిలో ఇలాంటి మ్యుటేష‌న్ ఏమైనా జ‌రిగిందా? అన్న‌ది తెలియాల్సి ఉంది.