Begin typing your search above and press return to search.

ఆయన్నే టార్గెట్ చేస్తున్నారే... ?

By:  Tupaki Desk   |   3 Feb 2022 8:33 AM GMT
ఆయన్నే టార్గెట్ చేస్తున్నారే... ?
X
అదేంటో ఒక ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయాలంటే ముఖ్యమంత్రి నేరుగా విమర్శిస్తారు. లేకపోతే సంబంధిత శాఖల మంత్రిని కూడా టార్గెట్ చేస్తారు. కానీ వైసీపీలో మాత్రం అందరి కళ్ళూ చూపులూ వేళ్ళూ కూడా ఒకే ఒక్క మనిషి మీదకే వెళ్తున్నాయి. ఆయనే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి. ఉద్యోగుల నిరసనలలో కూడా ఆయన మీదనే బాగా హాట్ హాట్ కామెంట్స్ పడుతున్నాయి.

అయ్యా ముఖ్యమంత్రి గారు, పక్కనున్న వారి సలహాలు వినవద్దు, వారు మీకు సరిగ్గా చెప్పడంలేదు, మీరు మా గోడు వినండి అని ఉద్యోగులు చలో విజయవాడ నిరసనలో గట్టిగా చెబుతున్నారు. పాదయాత్ర వేళ నేను ఉన్నాను, నేను విన్నాను అనే జగన్ ఇపుడు తమ గోడు వినడంలేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీరు తాడేపల్లి నివాసం నుంచి బయటకు రావడంలేదు, మా బాధ వినడంలేదు అని కూడా అంటున్నారు.

ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారు, ప్రభుత్వానికి తమకూ మధ్య చిచ్చు పెడుతున్నారు అని ఉద్యోగులు అంటున్నారు. అలా వారు టార్గెట్ చేసిందే సజ్జల రామక్రిష్ణారెడ్డిని అంటున్నారు. ఆయన ఒక విధంగా వైసీపీలో సూపర్ పవర్ గా మారిపోయారా అంటే ప్రచారం అయితే అలాగే ఉంది. ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో అసలు సజ్జల ఎందుకు కూర్చుంటున్నారని కూడా వారు ఇప్పటిదాకా నిలదీశారు కూడా.

ఆయనకు ఏ హోదాలో అక్కడ చోటు ఉందని కూడా అడుగుతున్నారు. మంత్రుల మధ్య సజ్జల ఉండడమేంటని కూడా నిలదీస్తున్నారు. కానీ వారికి అర్ధం కాని విషయం ఏంటి అయితే ఆయనే సూపర్ మినిస్టర్ అని. సరిగ్గా దాన్నే వారు విభేదిస్తున్నారు. ప్రభుత్వం తోనే తాము మాట్లాడుతామని సలహాదారుల‌తో కాదని కూడా నిన్నటిదాకా చెప్పారు కూడా.

ఇదిలా ఉంటే సజ్జల పాత్ర మీద ఆయన చుట్టూ ఉన్న అధికరాల మీద ఇప్పటిదాకా విపక్షాలు గట్టిగా గర్జించాయి. ఇపుడు ఉద్యోగులు కూడా అదే మాట అంటున్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఆయనే మాకు ముద్దు అంటోంది. ఒక విధంగా జగన్ మనసెరిగి నడచుకుంటున్న నాయకుడు సజ్జల అని అంటున్నారు.

అందుకే ఆయనకు అంత ప్రయారిటీ అని కూడా చెబుతున్నారు.ఏది ఎలా ఉన్నా సజ్జల మీద తమకు ఉన్న ఆగ్రహం మాత్రం ఉద్యోగుల ఆందోళనలో స్పష్టంగా కనిపిస్తోంది. మరి వైసీపీ సర్కార్ ఎలా దాన్ని సవరించుకుంటుందో. ఏ తీరుగా ఉద్యోగుల సమస్యల‌ మీద ముందుకు వెళ్తుందో చూడాలి.