Begin typing your search above and press return to search.
కవిత రాజకీయ భవిష్యత్ ఖతమేనా?
By: Tupaki Desk | 31 Jan 2020 10:55 AM ISTనిజామాబాద్ లో టీఆర్ఎస్ గెలిచి ఓడింది. అధికారంలో ఉండడంతో ఎలాగోలా కార్పొరేషన్ ను అయితే చేజిక్కించుకుంది. అయితే అవమానకరమైన విషయం ఏంటంటే నిజామాబాద్ కార్పొరేషన్ లో మొత్తం 60 సీట్లలో టీఆర్ఎస్ పార్టీ దారుణంగా 3వ స్థానానికి పడి పోయింది. 28సీట్లతో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఎంఐఎం ఉంది. 13 సీట్లే గెలిచిన టీఆర్ఎస్ మూడో స్థానానికి పడి పోయింది. దీంతో ఎక్స్ ఆఫీషియా, ఎంఐఎంతో కార్పొరేషన్ ను చేజిక్కించుకున్నపట్టికీ గులాబీ పార్టీకి ఇది తీరని ఓటమిగా టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.
నిజామాబాద్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయాక కవిత టీఆర్ఎస్ లో అజ్ఞాత వాసిగానే మిగిలిపోయారు. అస్సలు బయటకు రావడం.. ఓటమి భారంతో కృంగిపోతున్నారన్న చర్చ సాగుతోంది. తాజాగా నిజామాబాద్ కార్పొరేషన్ లో కూడా కవిత పాలుపంచుకోలేదు. నిజామాబాద్ అర్భన్, రూరల్ ఎమ్మెల్యేల మీదనే బాధ్యత పెట్టింది.అయితే సీట్ల పంపకాల్లో తప్పులు.. కవిత అనుచరులు, జాగృతి నేతలకు టికెట్లు ఇవ్వక.. గెలుపు గుర్రాలను పక్కన పెట్టడంతో టీఆర్ఎస్ బొక్క బోర్లా పడింది. దీంతో నిజామాబాద్ లో వచ్చేసారైనా కవితకు గెలుస్తుందన్న ధీమా లేకుండా చేశాయి మున్సిపల్ ఎన్నికలు..
ఇప్పుడు గోరు చుట్ట పై రోకలి పోటులా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కవితను మరింత బాధించాయన్న చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది. నిజామాబాద్ కార్పొరేషన్ లో సిట్టింగ్ బీజేపీ ఎంపీ అరవింద్ సత్తా చాటారు. ఏకంగా 60కి 28 సీట్లు సాధించి ఔరా అనిపించారు. ఇక టీఆర్ఎస్ పార్టీకి కేవలం 13 సీట్లు రాగా.. మిత్రపక్షం ఎంఐఎం 16 సీట్లను గెలుచుకో గలిగింది. అయితే ఎంఐఎం-టీఆర్ఎస్, ఎక్స్ ఆఫీషియోలు కలిసి నిజామాబాద్ కార్పోరేషన్ ను లాగేసినా నైతిక విజయం మాత్రం బీజేపేదే. నిజామాబాద్ ఓటర్లు దాదాపు సగం మంది బీజేపీకి ఓటేసినట్టే.. నిజామాబాద్ లో ఓటమి పై గులాబీ బాస్ కూడా ఫైర్ అయినట్టు సమాచారం. నిజామాబాద్ గెలిచిన బాధ కంటే అక్కడ మూడో స్థానానికి పడిపోయిన అవమానమే గులాబీ పార్టీని కలవరపెడుతోందట.. దీనిపై కేసీఆర్ ఎలాంటి ప్రణాళిక వేస్తాడన్నది ఆసక్తిగా మారింది.
పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లో ఓడిన గులాబీ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనైనా కోలుకుంటే మళ్లీ అక్కడే పోటీచేయాలని కవిత భావించారట.. కానీ ఇప్పుడు మున్సిపల్ ఫలితాలతో కవిత పునరాలోచనలో పడిపోయినట్టు తెలిసింది. ఇక నిజామాబాద్ ప్రజలు తనను ఆదరించరని.. ఇక ఆ అత్తగారి ఊరు కాడి వదిలేసి తన మకాంను సొంతిళ్లు మెదక్ పార్లమెంట్ కు మారిస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. హరీష్, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ లో కవిత గెలుపు ఈజీనే. ఆదరించని నిజామాబాద్ కన్నా మెదక్ కు కవిత మారడమే బెటర్ అని గులాబీ పార్లీలో చర్చ జరుగుతోంది.