Begin typing your search above and press return to search.
కాన్ఫిడెంట్ గా ఉండే కేసీఆర్ కన్ఫ్యూజ్ అవుతున్నారా?
By: Tupaki Desk | 2 Nov 2019 10:14 AM ISTకోపంలో కేసీఆర్ పెట్టే రివ్యూ ఎలా ఉంటుందో అనుభవంలోకి వచ్చేసిందట
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మామూలుగానే కాన్ఫిడెన్స్ ఎక్కువ. తాను నమ్మిన దానిని కోట్లాది మంది చేత నమ్మించే వారెంత ఆత్మవిశ్వాసంతో ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. అలాంటిది వరుస ఎదురుదెబ్బలు తగిలితే ఎలా ఉంటుంది? అందునా.. అరచేతిలో అందరిని శాసించే అధికారం ఉండి కూడా.. అదే పనిగా న్యాయస్థానం ముందు తప్పు చేసినట్లుగా దొరికిపోతున్న వైనం ఎంత అవమానకరం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఇటీవల కాలంలో కోర్టుకు ఇచ్చిన నివేదికల్లో అదే పనిగా తప్పులు దొర్లటం.. తాజాగా అసెంబ్లీలో మంత్రి వెల్లడించిన వివరాలకు.. కోర్టుకు ఇచ్చిన వివరాలకు పొంతన లేని వైనంపై హైకోర్టు తప్పు పట్టింది. ఇప్పటికే ఇలాంటి తప్పులు చోటు చేసుకున్న వేళ.. సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. వరుస పెట్టి అధికారులు చేస్తున్న తప్పులతో కోపంలో ఉన్న కేసీఆర్ తాజాగా నిర్వహించిన రివ్యూ మీటింగ్ హాట్ హాట్ గా సాగినట్లుగా చెబుతున్నారు.
ఆర్టీసీ విషయంలో తాను క్లియర్ గా ఉన్నప్పటికీ.. అందుకు తగ్గట్లు అధికారుల తీరు లేదన్న విషయాన్ని సూటిగా చెప్పేసినట్లు తెలుస్తోంది. నివేదికల్ని తయారు చేసే విషయంలో తరచూ తప్పులు దొర్లటం.. కోర్టుకు దొరికిపోవటం ఏమైనా పద్దతా? అని తలంటినట్లుగా సమాచారం. ఆర్టీసీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ.. ఆర్టీసీ ఈడీలతో సీఎం సమీక్షను నిర్వహించారు.
దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ రివ్యూ అసాంతం కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లే చెబుతున్నారు. హైకోర్టులో నడుస్తున్న కేసు.. ప్రభుత్వానికి అనుకూలంగా ఉందా? వ్యతిరేకంగా ఉందా? అన్న విషయాన్ని సూటిగా అడిగేయటంతో సమాధానం చెప్పలేక అధికారులు కిందామీదా పడినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ ఎపిసోడ్ విషయంలో మొదట్నించి కాన్పిడెంట్ గా ఉన్న కేసీఆర్.. అధికారులు ఇస్తున్న వరుస నివేదికలు తప్పులు కావటంతో ఉన్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందన్న విషయంలో ఆయన కొంత కన్ఫ్యూజన్ తో ఉన్నట్లుగా సమాచారం.
కోర్టుకు వివరాలు అందించే విషయంలో అదే పనిగా తప్పులు దొర్లటానికి కారణం ఎవరు? ఎందుకిలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న విషయాన్ని కేసీఆర్ ప్రత్యేకంగా ఆరా తీసినట్లు సమాచారం. అందుకు బాధ్యులైన వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
సాధారణంగా రివ్యూలకు దూరంగా ఉండే కేసీఆర్.. ఒకసారి రంగంలోకి దిగితే ఆయన సునిశితంగా ఆ విషయంలోకి వెళ్లటం.. ఆయనకు వచ్చే సందేహాలకు సమాధానాలు చెప్పటం ఒక పట్టాన సాధ్యం కాదంటారు. అలాంటిది నాలుగున్నర గంటల రివ్యూలో అధికారులకు చుక్కలే కనిపించినట్లుగా చెబుతున్నారు. రివ్యూ మీటింగ్ ఎప్పుడు అయిపోతుందిరా భగవంతుడా అన్నట్లుగా సాగిందని.. కేసీఆర్ కోపాన్ని తట్టుకోవటం కష్టంగా మారిందన్న మాట వినిపిస్తోంది.